Free Sandwiches For Lifetime: జంక్ ఫుడ్‌ని ఇష్టంగా తినే వారికి ఎవరికైనా శాండ్‌విచ్ అంటే ఇష్టం లేకుండా ఉంటుందా చెప్పండి. అందులోనూ రకరకాల ఫ్లేవర్స్, వెరైటీలో చూడ్డానికి నోరూరించే శాండ్ వించ్‌లు అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి.. పిజ్జాల తరువాత జంక్ ఫుడ్ లవర్స్‌ని అమితంగా ఆకర్షించేది ఈ శాండ్ విచ్‌లు, బర్గర్సే కదా... మరి ఈ శాండ్ విచ్‌లు లైఫ్ టైమ్ ఉచితంగా లభిస్తే ఇంకెలా ఉంటుందో చెప్పండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శాండ్‌విచ్‌లు లైఫ్ టైమ్ ఉచితంగా ఇస్తారా ? అవునా ? ఎవరు ఇస్తారు ? ఎందుకు ఇస్తారు ? ఇదేదో టైమ్ పాస్ ముచ్చట అయ్యుంటుంది లే అని అనుకుంటున్నారా ? అదేం లేదండి... మీరు చదివింది నిజమే.. సబ్‌వే రెస్టారెంట్ లైఫ్ టైమ్ మీకు శాండ్‌విచ్‌లు ఉచితంగా అందిస్తాం అంటోంది. అయితే అందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే. సబ్‌వే రెస్టారెంట్ వాళ్లు పెడుతున్న ఒక పోటీలో పాల్గొని వారు చెప్పినట్టు చేస్తే.. వాళ్లు ఎంపిక చేసే లక్కీ విన్నర్ మీరే అయితే.. ఇక మీకు లైఫ్ టైమ్ శాండ్‌విచ్ ఫ్రీ ... ఫ్రీ ... ఫ్రీ ...


ఇంతకీ ఏం చేయాలి ...
జీవితాంతం ఉచితంగా శాండ్‌విచ్ కాంటెస్ట్ గెలవాలంటే సబ్‌వే రెస్టారెంట్ వారు కోరినట్టుగా చట్టబద్ధంగా మీ పేరులో ముందట సబ్‌వే అని జోడించాల్సి ఉంటుంది. ముందుగా ఆగస్టు 1వ తేదీ నుంచి 4వ తేదీ లోగా సబ్‌వే రెస్టారెంట్ అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయి ఈ ఫ్రీ శాండ్‌విచ్ కాంటెస్ట్ ఛాలెంజ్‌లో మీ పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత పూర్తి చట్టబద్ధంగా మీ పేరుకు ముందు సబ్‌వే అని వచ్చేలా పేరు మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ మొత్తం తతంగాన్ని సబ్‌వే స్వయంగా గైడ్ చేస్తుంది. 


ఇది కూడా చదవండి : Giant Anaconda Snake Video: నిజంగానే ఇంత భారీ ఆనకొండ ఉంటుందా ?


అలా సబ్‌వే పెట్టిన ఈ కాంటెస్టులో పాల్గొన్న వారిలోంచి సబ్ వే వాళ్లు లక్కీ విన్నర్స్‌ని ఎంపిక చేస్తారు. ఆ లక్కీ విన్నర్స్‌కి పేరు మార్చుకోవడంలో అయిన ఖర్చుని కూడా తామే భరిస్తాం అంటోంది సబ్‌వే రెస్టారెంట్. అలా ఎంపిక అయిన లక్కీ విన్నర్స్‌కి ఇక జీవితాంతం శాండ్‌విచెస్ పండగే అనుకోండి. జీవితాంతం శాండ్‌విచ్‌లు సంగతి అలా కాసేపు పక్కన పెడితే.. జీవితాంతం జంక్ ఫుడ్ తిని వారి ఆరోగ్యం ఏమై పోతోంది అనే ఆలోచనే పాపం ఆందోళన కలిగిస్తోంది.


ఇది కూడా చదవండి : Rare White Snake Video: జనాన్ని భయంతో పరుగులు పెట్టించిన అరుదైన పాము



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి