)
Rare White Snake Video Spotted in Himachal Pradesh: మీరు ఇప్పటివరకు ఎన్నో రకాల పాములు చూసి ఉంటారు కానీ ఇలాంటి పామును మాత్రం చూసి ఉండకపోవచ్చు. ఇలా పూర్తిగా తెలుపు రంగులో ఉన్న ఈ పాము ఇండియాలో చాలా అరుదుగా కనిపిస్తుంటుంది. గతేడాది ఒక పాము మహారాష్ట్రలోని పూణెలో కనిపించింది. తాజాగా ఈ పాము హిమాచల్ ప్రదేశ్ లోని చంబలో కనిపించింది. బడ్కా హిమాచలి అనే ఒక ట్విటర్ యూజర్ ఈ స్నేక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న పామును ఎల్బినో స్నేక్ అని పిలుస్తారు. ఈ పాము ఇలా శ్వేతవర్ణంలో ఉండటానికి కారణం దానిలో శారీరకంగా కొన్ని లోపాలు ఉండటమే అని స్నేక్ సైన్స్ చెబుతోంది. పుట్టుకతోనే వచ్చిన జెనెటిక్ లోపాలు ఆ పాముని అలా తెలుపు రంగులోనే ఉండిపోయేలా చేస్తాయి. అంతేకాకుండా ఇలాంటి పాముల కళ్లు ఎరుపు రంగులో ఉంటాయి. ఇవి ఇలా తెలుపు రంగులో ఉండటానిరి పిగ్మెంటేషన్ కూడా ఒక కారణంగా నిపుణులు చెబుతున్నారు. ఈ ఎల్బినో స్నేక్స్ చూడ్డానికి మిగతా పాముల కంటే భిన్నంగా ఉంటాయి. అందుకే ఇవి చూపరుల దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తుంటాయి.
ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న పామును ప్రత్యక్షంగా చూసిన వారు హడలిపోయారట. ఇలాంటి పామును ఎప్పుడూ చూడలేదు.. ఇదేంటి ఇలా ఉంది అని కంగారుపడి పాముకు దూరంగా పరుగులు పెట్టారట. అదే సమయంలో ఆ పాము పూర్తి తెలుపు రంగులో ఉండటం కూడా వారిని మరింత ఆసక్తికి గురిచేసిందట. ఈ వీడియోను మీరు నిశితంగా పరిశీలిస్తే.. ఈ పామును తమ కెమెరాలో బంధించిన వారు కూడా దూరం నుంచే షూట్ చేయడం గమనించవచ్చు.
दुर्लभ एल्बिनो सांप ?
वीडियो हिमाचल प्रदेश के चंबा जिले का बताया जा रहा है।#Himachal #Chamba #albinosnake #RareSnake pic.twitter.com/eHT9v3tke9
— Badka Himachali (@BadkaHimachali) July 29, 2023
ఒక బండ రాయి వద్ద తొలుత కనిపించిన ఈ పాము చాలా అంటే చాలా నెమ్మదిగా పాకుతూ వెళ్లడం ఈ వీడియోలో చూడొచ్చు. ఎల్బినో స్నేక్స్ కి ఉన్న మరో సమస్య ఏంటంటే.. క్రమక్రమంగా ఈ పాములకు చూపు మందగిస్తుందట. దాదాపు 5 అడుగుల పొడవు ఉన్న ఈ పాముకు కూడా బహుషా కళ్లు కనపడటం లేదో లేక దాని వైఖరే అంతేనేమో తెలియదు కానీ ఇది చాలా నెమ్మదిగా పాకుతూ ముందుకు వెళ్తోంది.
క్రమక్రమంగా కళ్లు కనబడకుండా అవుతాయంటే నిజంగానే పాపం అనిపిస్తోంది కదూ.. పాము ఎంత విష సర్పమైనా కావొచ్చు.. కానీ అది కూడా ఒక జీవే కదా.. దానికి కూడా ఈ భూమ్మీద అన్ని జీవరాశులతో సమానంగా జీవించే హక్కు ఉంది కదా.. మరి అది కళ్లు కనపడకపోతే వాటి పరిస్థితేంటి ? అవి ఆహారాన్ని ఎలా వెతుక్కుంటూ పోతాయి ? కళ్లు కనపడని కారణంగా ఇలాంటి పాములు వేరే పాములకు ఆహారం అవడం కానీ లేదా వేరే జీవులకు కానీ ఆహారంగా మారే ప్రమాదం కూడా లేకపోలేదు కదా అన్న ఊహే బాధనిపిస్తోంది కదా.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe