Latest Viral Video Watch Here​: టెక్నాలజీ ఎప్పటికప్పుడు పెరగడంతో ఇంటర్నెట్లో ఏది షేర్ చేసిన సులభంగా వైరల్ అవుతోంది. ఇలా ప్రతిరోజు కొన్ని లక్షల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కొన్నిసార్లు ట్రెండింగ్ వీడియోలు వైరల్ అవుతాయి మరికొన్నిసార్లు మాత్రం గతంలో జరిగిన సన్నివేశాలకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతాయి. అయితే ఇటీవలే వైరల్ అవుతున్న ఓ వీడియో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎప్పుడు తెలుసుకోలేనటువంటి కొన్ని వింత విషయాలకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. చాలామంది సాధారణంగా ఏడు అడుగులు మించి మనుషులను చూసి ఉండరు.. కానీ మనం ఈరోజు అంతకంటే ఎక్కువ ఎత్తు ఉండే మనిషికి సంబంధించిన వీడియో చూడబోతున్నాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రపంచంలోనే అత్యంత పొట్టి పొడవైన అమ్మాయిలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తోంది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ వీరిద్దరిని ప్రత్యేకంగా సత్కరించింది కూడా.. అయితే ప్రపంచంలోనే అత్యంత పొడవైన పొట్టిగా కలిగిన అమ్మాయిలు లండన్ లో ఇటీవల సమావేశమయ్యారు. లండన్ లోని ఎంతో ప్రఖ్యాతిగాంచిన ఓ పెద్ద హోటల్లో వీరిద్దరూ కలుసుకొని వారి జీవితాల గురించి ఒకరికొకరు పంచుకున్నారు. అయితే వీరిద్దరిని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డే కలిపిందని ప్రకటించింది.


ఇక వీరి వివరాల్లోకి వెళితే ప్రపంచంలోనే ఎత్తైన అమ్మాయి పేరు రుమేసా కాగా.. అతి పొట్టిగా ఉండే మహిళ పేరు జ్యోతి.. వీరిద్దరూ కలుసుకోవడం ఇదే మొదటిసారి అని తెలిపారు. ఇందులోని అతి పొడవైన మహిళ దాదాపు 215.16 సెం.మీ పైగా ఉంటుందట. ఇక అతిగా పొట్టిగా ఉండే మహిళ కేవలం 62.8 సెం.మీ. మాత్రమే ఉంటున్నట్లు తెలిపారు. అయితే ఇందులోని అతి పొట్టైన మహిళ భారతదేశానికి చెందింది. అలాగే ఈమె భారత గవర్నమెంటు చేత అనేక బిరుదులు పొందినట్లు సమాచారం. అంతేకాకుండా ఈమెను ప్రభుత్వం అన్ని విధాల ప్రోత్సహించినట్లు కూడా తెలిపింది.


Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా?


ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. చాలామంది వీరిద్దరిని చూసి ఆశ్చర్యపోతున్నారు. ప్రపంచంలో ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే వీరిద్దరికి ఉన్న ప్రతిభను గిన్నిస్ బుక్ గ్రహించి వీరిని ఒక చోటికి చేర్చినట్లు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ సిబ్బంది తెలిపారు. అలాగే వీరిద్దరితో మాట్లాడి.. జీవితంలోని పలు అనుభవాలను కూడా తెలుసుకున్నట్లు సమాచారం.


Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.