Rare Python Video: రేర్ కొండచిలువను కెమెరాలో బంధించిన తెలుగు సైకిల్ యాత్రికుడు.. ఆ స్నేక్ ఎలా ఉందో చూస్తారా?
Rare Python Video Goes To Viral: ఓ తెలుగు యూట్యూబర్ ఆస్ట్రేలియా రేర్ కొండచిలువకు సంబంధించిన వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
Rare Python Video Captured By Ranjith On Wheels: సోషల్ మీడియా వినియోగం పెరిగినప్పటి నుంచి ఎలాంటి వీడియోలు షేర్ చేసిన నిమిషాల వ్యవధిలోనే కొన్ని లక్షల మందికి రీచ్ అవుతున్నాయి. ముఖ్యంగా పాములకు సంబంధించిన వీడియోలు ఏవి షేర్ చేసిన క్షణాల వ్యవధిలోనే వైరల్ అవుతున్నాయి. కొంతమంది నెటిజన్స్ ఎక్కువగా జంతువులు సంస్కృపాలకు సంబంధించిన వీడియోలనే చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇందులో భాగంగానే పాములు ఇతర జంతువులకు సంబంధించిన ఎలాంటి వీడియోలు షేర్ చేసిన లక్షల మందికి చేరుతున్నాయి. ముఖ్యంగా పాములను రిస్క్ చేసి పట్టుకున్న వీడియోలు ఎక్కువ వ్యూస్ సంపాదించుకుంటున్నాయి. అలాగే పెద్ద పెద్ద అనకొండలు, ఎంతో విషపూరితమైన నాగుపాములు, భయానకమైన కొండచిలువాల సంబంధించిన వీడియోలు కూడా ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటున్నాయి. అయితే ఇటీవలే ఓ సైకిల్ యాత్రికుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొండచిలువ పాము కు సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ వీడియోలో ఏముందో? వైరల్ అవ్వడానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అయ్యే వీడియోలు కొండచిలువ పాములకు సంబంధించిన సన్నివేశాలు కూడా ఉంటున్నాయి. నేటిజన్స్ ఈ పాములకు సంబంధించిన వీడియోలను కూడా ఎక్కువగా చూసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అయితే ఇందులో భాగంగానే ప్రముఖ సైకిల్ యాత్రికుడు రంజిత్ ఆన్ వీల్స్(Ranjith on wheels) ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పాముకు సంబంధించిన వీడియో నెట్టింట్లో చెక్కర్లు కొడుతోంది. వీడియో వివరాల్లోకి వెళితే.. సైకిల్ యాత్రికుడు రంజిత్ ఆస్ట్రేలియాలో సైక్లింగ్ చేస్తున్నాడు. అయితే ఇదే సమయంలో ఆయన సైకిల్ తొక్కి అలసిపోయి.. ఓ ఫార్మర్ ఇంటిముందు కొద్దిసేపు రెస్ట్ తీసుకునేందుకు కూర్చుంటాడు. అయితే ఇదే సమయంలో రంజిత్ తన వెనుక ఉన్న ఓ పెద్ద రేర్ కొండచిలువ పడుకొని ఉండడం గమనిస్తాడు. దీంతో ఆయన పడుకొని ఉన్న కొండచిలువను తన కెమెరాలు బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
వీడియోలో రంజిత్ ఏమన్నారంటే..?
రంజిత్ ఈ వీడియోలో ఒక ఫార్మర్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారని.. కూర్చుని ఉండే సమయంలో ఒకదానిని చూసానని.. అది మీకు కూడా చూపిస్తాను అని అంటారు. అతను ఆ పాములు చూపించుతూ పట్టుకుందామా అని ఫన్నీగా అంటాడు. అలాగే తనకు పాములంటే చాలా ఇష్టమని.. కనిపించిన ప్రతిసారి వాటిని పట్టుకొని ఆడుకోవాలనిపిస్తుందంటారు. అంతేకాకుండా దానిని పట్టుకోవచ్చు.. కానీ పడుకుందని.. నేచర్ ను డిస్టర్బ్ చేయడం మంచిది కాదని అంటారు. ఆయనకు పాములంటే ఇష్టమని ఎప్పుడూ వాటిని చూసినా భయపడకుండా ఉంటారని తెలిపారు.
సోషల్ మీడియాలో వీడియో ఫుల్ వైరల్..
ప్రస్తుతం ఈ వీడియోను రంజిత్ తన ఇంస్టాగ్రామ్ ఖాతా అయిన @Ranjithonwheels నుంచి షేర్ చేశారు. ప్రస్తుతం ఈ కొండచిలువకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇప్పటివరకు ఈ వీడియోను దాదాపు 20వేల సోషల్ మీడియా వినియోగదారులకు పైగా లైక్ చేశారు. అంతేకాకుండా దీనిని 3 లక్షల మందికిపైగా వీక్షించినట్లు తెలుస్తోంది. అయితే నెటిజన్స్ ఈ వీడియో పై కామెంట్ల రూపంలో వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది నెటిజన్స్ "ఇలాంటి పాములను చూస్తే భయంతో దూరంగా పరిగెడతామని" కామెంట్ రూపంలో స్పందిస్తున్నారు. ఇక మరి కొంతమంది అయితే.. "పాము ఎప్పుడు పామేనని.. వాటితో స్నేహం చేసిన వాటి బుద్ధి చూపిస్తాయని.. వాటి జోలికి పోకుండా ఉండడమే బెటర్ అని" అంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.