Lion vs Crocodile Fight Video: మెుసలిపై మూడు సింహాలు దాడి... ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న వీడియో
Lion vs Crocodile Fight Video: జంతువులకు సంబంధించిన వీడియోలు ఈ మధ్య నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న అలాంటి వీడియోను మీరు చూసేయండి.
Lion vs Crocodile Fight Video: సోషల్ మీడియాలో (Social Media) ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఈ మధ్య జంతువులకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో కొన్ని ఫన్నీగా ఉంటే, మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా పాము, కోతి, పులి, సింహం, ఏనుగు వంటి జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఒక మెుసలిపై మూడు సింహాలు దాడి చేస్తున్న దృశ్యాలు చూస్తుంటే..ఒళ్లు గగుర్పాటుకు గురిచేస్తున్నాయి. ఈ వీడియోను నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మీరు ఈ వీడియోపై ఓ లుక్కేయండి మరి.
అడవికి రాజు సింహం. ఇది ఏ జంతువునైనా వేటాడి తింటుంది. సాధారణంగా మెుసళ్లు, సింహాలు ఒకరిపై ఒకరు దాడి చేశారు. వీటి మధ్య అరుదైన సందర్భాల్లో మాత్రమే ఫైట్ చేసుకుంటాయి. నీటిలో ఉంటే మెుసలి ఎలాంటి జంతువునైనా మట్టుపెట్టగలదు. భూమిపై ఉంటే సింహం కూడా అంతే. తక్కువ నీరున్న ఓ ఉప్పునీటి సరస్సులో ఉన్న మెుసలిపై 3 సింహాలు దాడి (Lions Attacks On Crocodile) చేస్తాయి. మెుసలి తన ప్రాణాలను రక్షించుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతుంది. lionsdaily అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు 62వేల మంది వీక్షించారు. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
Also Read: Viral Video: రోడ్డుపై చేపల వర్షం... బకెట్లతో భారీగా ఎగబడ్డ జనం... వీడియో వైరల్...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook