New IT Rules in India: భారత్‌లో రెసిడెంట్ గ్రీవన్స్ ఆఫీసర్‌ను మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ నియమించింది. వినయ్ ప్రకాష్‌ను తమ రెసిడెంట్ గ్రీవన్స్ ఆఫీసర్‌గా నియమించినట్లు ప్రకటించింది. భారత్‌లో ఐటీ రూల్స్‌లో విఫలమవడం, ఇతరత్రా కారణాలతో సోషల్ మీడియాపై కొన్ని ఫిర్యాదులు కేంద్ర ప్రభుత్వానికి అందాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ట్విట్టర్ చీఫ్ కాంప్లియన్స్ ఆఫీసర్, నోడల్ ఆఫీసర్ మరియు గ్రీవన్స్ ఆఫీసర్‌ల నియామకం చేపట్టాలని, నూతన ఐటీ చట్టం రూల్స్‌(New IT Rules)కు అనుగుణంగా భారత్‌లో కార్యకలాపాలు కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం అమెరికాకు చెందిన ట్విట్టర్ సంస్థకు సూచించింది. ఈ క్రమంలో చీఫ్ గ్రీవన్స్ ఆఫీసర్‌గా వినయ్ ప్రకాష్‌ను నియమించింది. చీఫ్ కాంప్లియన్స్ ఆఫీసర్, నోడల్ ఆఫీసర్ మరియు గ్రీవన్స్ ఆఫీసర్‌లు భారత్‌లోనే నివాసం ఉంటారు. ఈ మైక్రో బ్లాగింగ్ సైట్‌కు 50 లక్షల యూజర్లున్నారు. ట్విట్టర్ పేజీలో పేర్కొన్న ఈమెయిల్ ఐడీ ద్వారా గ్రీవన్స్ ఆఫీసర్ వినయ్ ప్రకాష్‌ను సంప్రదించాలని ట్విట్టర్ సంస్థ తన భారత వినియోగదారులకు సూచించింది.


Also Read: Donald Trump: ఫేస్‌బుక్, ట్విట్టర్ సంస్థలపై డోనాల్డ్ ట్రంప్ దావా


భారత్‌లో ట్విట్టర్ కార్యాలయాన్ని సంప్రదించాలనుకుంటే 4వ అంతస్తు, ద ఎస్టేట్, 121 డికెన్‌సన్ రోడ్, బెంగళూరు 560042 అడ్రస్‌లో సంప్రదించాలని ట్విట్టర్ పేజీలో పేర్కొంది. గ్లోబల్ లీగల్ పాలసీ డైరెక్టర్ జేరెమీ కెస్సెల్ పేరుతో పాటు వినయ్ ప్రకాష్ పేరు అందులో కనిపిస్తుంది. మే 26 నుంచి అమలులోకి వచ్చిన ఐటీ రూల్స్ ప్రకారం మే 26, 2021 నుంచి జూన్ 25, 2021 వరకు నెలరోజుల వ్యవధిలో కాంప్లియన్స్ (FIR on Twitter) వివరాలు ట్విట్టర్ నివేదిక ప్రచురించింది. ధర్మేంద్ర ఛతూర్ పదవి నుంచి తప్పుకోగా, ప్రకాష్‌కు ఆ బాధ్యతలు అప్పగించింది.  


Also Read: CBI on Social Media: సోషల్ మీడియా పోస్టింగుల కేసులో సీబీఐకు కీలక ఆధారాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook