మనలో చాలా మంది ఒక డోస్ (Covid-19 First Dose) కూడా తీసుకొని వారి సంఖ్య లక్షల్లో ఉంటే.. మొదటి డోస్ వేసుకొని రెండో డోస్ (Covid-19 Second Dose) కోసం ఎదురు చూసే వారి సంఖ్య కోట్లలోనే ఉంది. ఒక వ్యక్తి మాత్రం.. 3 రకాల కోవిడ్-19 వ్యాక్సిన్లను ఇలా 5 సార్లు తీసుకున్నాడు. అధికారులు ఎందుకు ఇలా వేసారు? ఆ వ్యక్తి ఎందుకు అన్ని డోసులు వేయించుకున్నాడో చూద్దామా..?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దక్షిణ అమెరికా (South America) ఖండంలోని బ్రెజిల్ (Brazil) దేశంలో ఈ సంఘటన జరిగింది. అక్కడ ఊరూ, పేరూ లేని ఒక వ్యక్తి... మే, జూన్‌లో వరుసగా కరోనా (Corona) వ్యాక్సిన్ డోసులు తీసుకున్నాడు.. అంతేకాకుండా తాజాగా మరో డోస్ కోసం ఏమి తెలియని వాడిలా వచ్చి వ్యాక్సినేషన్ (Covid-19 vaccination Center) కేంద్రంలో కూర్చున్నాడు. సిబ్బందిలో ఒకరు ఆ వ్యక్తి తీసుకున్న డోసుల చిట్టాను తీసి చూసారు.. అంతే ఇక షాక్ అవ్వడం అధికారుల వంతు అయింది. ఇప్పటి వరకు ఆ అజ్ఞాతవ్యక్తి 3 రకాల వ్యాక్సిన్ లను 5 డోసులుగా తీసుకున్నాడు. 


Also Read: Model BBL Surgery: బాబోయ్..! రూ. 26లక్షలతో సర్జరీ.. కూర్చోలేకున్న..కోట్లలో సంపాదన...!


నిజానికి బ్రెజిల్ దేశంలోని ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ సర్వర్ లో ఒక  లోపం ఉంది. ఆ లోపాన్ని అడ్డుపెట్టుకొని ఆ వ్యక్తి ఇన్ని సార్లు వ్యాక్సిన్ వేయించుకున్నాడు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేవని ప్రభుత్వాధికారులు వెల్లడించింది.. 


బ్రెజిల్ దేశం తెలిపిన వివరాల ప్రకారం... ఆ వ్యకికి మే 12న ఫైజర్ (pfizer vaccine) టీకా...జూన్ 5న కోవిషీల్డ్ (Covishield vaccine)... జూన్ 17న కోవిషీల్డ్ (Covishield vaccine) సెకండ్ డోస్...జులై 9న ఫైజర్ (pfizer) టీకా సెకండ్ డోస్.. మళ్లీ జులై 21న కరోనావ్యాక్ (Coronavac Vaccine)మొదటి డోస్ వేయించుకున్నాడు.  ఇలా 6వ సారి ఆ వ్యక్తి ఏ వ్యాక్సిన్ డోసు కోసం వచ్చాడో తెలియదు కానీ.. ఇన్ని డోసులు ఎలా వేసారా అని ప్రభుత్వ అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. 


Also Read: Bank Holidays: సెప్టెంబర్ నెలలో బ్యాంకులకు సగం రోజులు సెలవులే


ఇదిలా ఉండగా.. మొదరి సారి, రెండో సారి ఆన్ లైన్ లోపాల కారణంగా అతడి వివరాలను నోట్ చేసుకొని, అతడికి వ్యాక్సిన్ ఇచ్చి పంపించారు.. వచ్చిన ప్రతి సారి మొదటి సారి వ్యాక్సిన్ అని చెప్పటంతో.. వివరాలను ఆన్ లైన్ లో ఎక్కించకుండా నోట్ చేసుకోని వ్యాకిన్ ఇచ్చి పంపించారు అధికారులు. 


బ్రెజిల్ దేశంలో తాజాఫా వ్యాక్సిన్ కొరత ఏర్పడింది.. ఫలితంగా ఆ అజ్ఞాత వ్యక్తికి ఏ డోస్ వేయాలన్న ఆలోచనలో అతడి పూర్వపు చిట్టా మొత్తాన్ని భయటకి తీయగా అసలు విషయం భయటపడింది. 


ఇలా వ్యాక్సిన్ పంపకాల్లో తప్పిదం మూడోసారి అయిన.. మూడు రకాల వ్యాక్సిన్ లను 5 డోసులుగా తీసుకున్న ఈ వ్యక్తి ఇంకా ఆరోగ్యకరంగా, ఎలాంటి సమస్య లేకుండా ఉన్నాడని అక్కడి మీడియా తెలిపింది. ఈ వ్యక్తిని స్పెషల్ కేసుగా పరిగణించి, అతని ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికపుడు పరీశిలిస్తున్నామని అధికారులు తెలిపారు.


Also Read: Tokyo Paralympics 2021: చరిత్ర సృష్టించిన టీటీ ప్లేయర్​ భవీనాబెన్ పటేల్.. భారత్​కు తొలి పతకం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  Twitter , Facebook