Royal bengal Tiger: రాయల్ బెంగాల్ టైగర్ తో యువతి చెలగాటం.. ఒళ్లుగగుర్పొడిచే ఘటన.. వీడియో వైరల్..
Us woman climb into zoo: యువతి యూఎస్ లోని ఒక జూలో.. రాయల్ బెంగాల్ టైగర్ ఉన్న బోను ఎన్ క్లోజర్ లోకి ప్రవేశించింది. అంతే కాకుండా.. అక్కడ పులిదగ్గరకు తింగరి పనులు చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
us woman climbs into cohanzick zoo tigers enclosure: కొంత మంది తమ ఫ్యామిలీతో ఎక్కువగా గడిపేందుకు ఆసక్తిచూపిస్తుంటారు. మరికొంత మంది కొత్త ప్రదేశాలకు వెళ్తుంటారు. ఈ క్రమంలో తరచుగా.. జలపాతాలు, అడవులకు వెళ్తుంటారు. ఇంకా కొంత మంది జూలకు కూడా వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో జూలలో అనేక జంతువులు ఉంటాయి. సింహాలు, పులులు, ఏనుగులు,కోతులు, మొసళ్లు, నెమళ్లు, పాముల వంటి రకరకాల జంతువులు ఉంటాయి. అయితే.. కొంత మంది మాత్రం జూలలో వెళ్లి జంతువులనుచూసి ఎంజాయ్ చేస్తుంటారు .
కానీ కొందరు మాత్రం దీనికి భిన్నంగా మూగజీవాలను రాళ్లతో కొడుతూ వారి సైకోయిజం చూపిస్తుంటారు. తమను ఏమనుకున్న కూడా జంతువులను రాళ్లతో కొడుతుంటారు. అంతేకాకుండా.. క్రూర జంతువులు ఎన్ క్లోజర్ లోకి ప్రవేశించడానికి చూస్తుంటారు. దగ్గరి నుంచి ఫోటోలు దిగడానికి సైతం రిస్క్ లు చేస్తుంటారు. ఇలాంటి ఘటనల వల్ల చాలా మంది తమ ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కొకొల్లలు. కొంత మంది కావాలని సింహాం, పులులున్న ఎన్ క్లోజర్ లోకి ప్రవేశించిన ఘటనలు గతంలో జరిగాయి. తాజాగా, ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు..
అమెరికాలో ఒక యువతి చేసిన తింగరి పని ప్రస్తుతం వార్తలలో నిలిచింది. న్యూజెర్సీ రాష్ట్రంలోని కొహాన్‌జిక్ జూలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. బ్రిడ్జ్‌టన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జూకు వచ్చిన ఓ మహిళ కాసేపు రాయల బెంగాల్ టైగర్ ను దగ్గరి నుంచి చూసింది. ఆమెకు ఏమనిపిచ్చిందో ఏంటోకానీ..ఎన్ క్లోజర్ లోకి దూకింది. అక్కడ కేవలం ఒక ఫెన్సింగ్ మాత్రమే యువతికి, పులికి అడ్డంగా ఉంది. ఆ యువతి.. ఎన్ క్లోజర్ లోకి దూకడమేకాకుండా.. ఫెన్సింగ్ నుంచి పులిని తాకే ప్రయత్నం కూడా చేసింది.
యువతి బోనులోకి దూకగానే అప్రమత్తమైన పులి అలర్ట్ అయ్యింది. యువతిపై దాడిచేసేందుకు గాండ్రిస్తు. అటు ఇటు తిరిగింది. కానీ ఇంతలో ఆమె టైమ్ బాగుందో ఏంటో కానీయువతి మరల వెనక్కు వెళ్లిపోయింది. యువతి చేసిన తింగరి పని అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఈ ఘటన యూఎస్ పోలీసులు.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇలాంటి పనులు చేయడం మానుకొవాలని హితవు పలికారు.
ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలాంటి పనులు చేస్తే.. చట్టప్రకారం పనిష్మెంట్ కూడా ఉంటుదని కూడా పోలీసులు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. ఈ వీడియోప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక జూ అధికారుల ప్రకారం, ఆ జూలో.. రిషి, మహేశా అనే రెండు బెంగాల్ టైగర్లు ఉన్నాయి. 2016లో ఆ జూలో వీటిని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
Read more: Hyderabad Rains: హైదరాబాద్ లో అరుదైన దృశ్యం... ఆరడుగుల ప్రదేశంలో దంచికొట్టిన వాన.. వీడియో వైరల్..
ప్రస్తుతం ఏకంగా 500 పౌండ్ల బరువును దాటిపోయాయట. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కేవలం 3500 బెంగాల్ టైగర్లు మాత్రమే ఉన్నాయి.ఇక పులుల సంరక్షణ కోసం మన దేశం ప్రాజెక్టు టైగర్ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook