Cop performs cpr on monkey in uttar pradesh: కొందరు రోడ్డుపైన పడిపోయిన అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతుంటారు. వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది గుండెనొప్పి బారిన పడుతున్నారు. ఇదిలా ఉండగా.. కొన్నిసార్లు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన వారిని, సరైన సమయంలో సీపీఆర్ చేస్తే ప్రాణాలు దక్కే చాన్స్ వంద శాతం ఉన్నట్లు వైద్యులు చెబుతుంటారు. అందుకే డాక్టర్లు, ఈ మధ్య కాలంలో సీపీఆర్ మీద ఎక్కువగా అవగాహాన కల్పిస్తున్నారు. సీపీఆర్ ను ఎలా చేయాలి, సీపీఆర్ వల్ల కలిగే ప్రయోజానాలపై వివరణ ఇస్తున్నారు. ఇదిలా ఉండగా.. కొన్ని రోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



భానుడి ప్రతాపానికి జనజీవనమంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. బైటకు వెళ్లాలంటేనే చాలా మంది భయంతో వణికిపోతున్నారు. ఇక మరోవైపు ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి. మనుషులు చాలా చోట్ల వడదెబ్బలకు పిట్టల్లా రాలిపోతున్నారు. వడదెబ్బలు తగలకుండా, జాగ్రత్తలు తీసుకొవాలంటూ కూడా వైద్యులు సూచిస్తున్నారు. ఇక మనుషులమే, ఎండ వేడికి తాళలేకపోతున్నాము.


ఇక మూగ జీవాల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొందరు మూగ జీవాల కోసం ప్రత్యేకంగా తాగడానికి నీళ్లు ఏర్పాట్లు చేస్తుంటారు. అయితే.. ఒక కోతి ఎండ వేడికి తాళలేక చెట్టుమీద నుంచి స్పృహతప్పి కిందకు పడిపోయింది. అక్కడే ఉన్న కానిస్టేబుల్ కోతికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


పూర్తి వివరాలు.. 


ఉత్తర ప్రదేశ్ లోని బులంద్ షహర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కొన్నిరోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. ఎండ వేడికి భరించలేక జనాలు ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉండగా.. ఛతారీ పీఎస్ పరిధిలో ఒక చెట్టుపై నుంచి కోతి కింద పడింది. ఎండకు తాళలేక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే అక్కడున్న హెడ్ కానిస్టేబుల్ తోమర్ అక్కడికి చేరుకున్నాడు. కోతికి తన చేతిలో తీసుకుని దానికి సీపీఆర్ చేశారు. కోతిని అటు ఇటు కదిలిస్తు, గాలి ఇస్తు, సీపీఆర్ (కార్డియోపల్మోనరీ రిససిటేషన్) చేశాడు.


Read more: Hot Romance: రన్నింగ్ బస్సులో అశ్లీల పనులు.. లాస్ట్ సీటులో ఒకరిమీద మరోకరు..


అంతటితో ఆగకుండా కోతికి వాటర్ కు తాగించి, దాని తమ మీద నీళ్లు కూడా పోశాడు. ఇంతలో కోతికి కదలడం ప్రారంభించింది. అటు మునుపటిలా పైకి ఎగురుతు అక్కడి నుంచి ఎస్కెప్ అవ్వడానికి ప్రయత్నించింది. కోతి తిరిగి మాములు స్థితికి రావడంతో అక్కడున్న వారంతా ఆనందం వ్యక్తం చేశారు. హెడ్ కానిస్టేబుల్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మీరు గ్రేట్ సార్.. హ్యాట్సాఫ్ సార్.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter