Common Krait Viral Video: ప్రాణాంతకమైన పామును పట్టిన ప్రముఖ స్నేక్ క్యాచర్.. వీడియోని చూస్తే ఆశ్చర్యపోతారు..
Common Krait Viral Video: ఇటీవల సోషల్ మీడియాలో ఓ స్నేక్ క్యాచర్ కట్లపామును పట్టుకున్న వీడియో తెగ వైరల్ అవుతోంది. స్నేక్ క్యాచర్ పామును రెండు చేతులతో పట్టుకొని దాని గురించి వివరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.
Common Krait Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. అందులో చాలా వరకు జంతువులకు సంబంధించిన వీడియోలే ఎక్కువగా ఉంటున్నాయి. ఇవే కాకుండా స్నేక్ క్యాచర్స్ ఎంతో రిస్క్ చేసి పాములను కాపాడిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వీటిల్లో కూడా చాలా వరకు వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఇటీవల ఓ స్నేక్ క్యాచర్ కట్లపామును పట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోకు సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కట్లపాములు చాలా విషపూరితమైనవి ఇది కాటేసిన గంటలోపలనే వ్యక్తి మరణిస్తాడు. కాబట్టి ఇది కొట్టిందని తెలుసుకోగానే గవర్నమెంట్ హాస్పిటల్ లో చికిత్స పొందడం చాలా మంచిదని స్నేక్ క్యాచర్స్ చెబుతున్నారు. వీడియోలోని వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా కోరేగాడ మండలంలోని ఓ ఇంట్లోని కట్లపాము చొరబడుతుంది. దీనిని గమనించిన ఇంటి యజమాని అక్బర్ అజీజ్ అనే స్నేక్ క్యాచర్ కి సమాచారం అందిస్తాడు. దీంతో ఆ స్నేక్ క్యాచర్ పాము చొరబడ్డ ప్రదేశానికి చేరుకుంటాడు. అప్పటికే ఆ పాము నీటిలో ఉండడం చూసి స్నేక్ క్యాచర్ ఆ పాములను పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు. నెమ్మదిగా ఆ పామును పట్టుకుంటాడు.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్నేక్ క్యాచర్ అక్బర్ అజీజ్ మాట్లాడుతూ.. అతను పట్టుకుంది ప్రమాదకరమైన కట్లపామని తెలిపారు. ఈ పాము కాటేస్తే సకాలంలో చికిత్స పొందడం మంచిదన్నారు.. లేకపోతే ప్రాణాలు కోల్పోయే అవకాశాలు కూడా ఉండొచ్చని అన్నారు. ఈ పాములు సర్వసాధారణంగా రాత్రి 7 గంటల లోపల సంచారం చేస్తాయని ఆయన తెలిపారు. ఈ పాములు వానాల కారణంగా కూడా ఇళ్లలోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయన్నారు. మొదట ఈ పాము కాటేసినప్పుడు చీమ కొరికినట్లే అనిపిస్తుందట.. ఆ తర్వాత తల తిరగడం పొట్టలో మార్పులు రావడం వంటి సమస్యలు వస్తాయని ఆయన అన్నారు.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి