Jokes on Zomato: ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్​ జొమాటోపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. జోక్స్​, మీమ్స్​తో పంచులు వేస్తున్నారు. ఆ సంస్థ ఇటీవల చేసిన ఓ ప్రకటన ఇందుకు కారణం. ఇంతకీ జొమాటో చేసిన ప్రకటన ఏమిటి? నెటిజన్లు ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంతకీ జొమాటో చేసిన ప్రకటన ఏమిటి?


జొమాటోలో ఆర్డర్​ చేస్తే 10 నిమిషాల్లోనే డెలివరీ చేసేలా.. ఇటీవల కంపెనీ ఓ ప్రకటన చేసింది. కేవలం పది నిమిషాల్లో డెలివరీ పాలసీ వల్ల.. డెలివరీ భాగస్వాములపై తీవ్ర ఒత్తిడి పడుతుందని.. టైమ్​ టార్గెట్​ను అందుకునే క్రమంలో ప్రమాదాల భారినపడొచ్చని నెటిజన్లు అంటున్నారు. ఇదే విషయంపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.


ఓ మీమ్​లో ఫిరంగిలో ఓ మనిషిని కూర్చోబెడుతున్నట్లున్న ఓ ఫొటోను షేర్ చేశాడు ట్విట్టర్ యూజర్​. ఫిరంగిలో గుండు పెల్చినట్లు వేగంగా వెళ్లాలా అనేలా విమర్శనాత్మకంగా ఈ మీమ్​ క్రియేటర్​ చేశాడు.



మరో యూజరేమో.. హెవీ ట్రాఫిక్ ఉండే రోడ్లపై డెలివరీ 10 నిమిషాల్లో ఏలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు.



ఇంకో యూజరేమో ట్రాఫిక్​లో రయ్​ రయ్​ అంటూ ఓ వ్యక్తి బైక్ నడుపుతున్న ఓ సినిమా క్లిప్​ను పోస్ట్ చేసి.. డెలివరీ బాయ్​ల పరిస్థితి ఇదేనంటూ స్పందించారు.



మొత్తం మీద జొమాటో తీసుకున్న 10 నిమిషాల్లో డెలివరీ నిర్ణయంపై అసంతృప్తి ఎక్కువగా కనిపిస్తోంది.


Also read: Viral Video: యాత్రికులను బెంబేలెత్తించిన స్నేక్.. ఒక్కసారిగా బుసలు కొడుతూ ఎటాక్..


Also read: Security For Mango: మామిడి పండుకు Z+ కేటగిరీ భద్రత.. కారణమేంటో తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook