TDP Leader Video: మరో టీడీపీ నేత రాసలీలలు..రాత్రికి వస్తేనే పింఛన్ అంటున్న రసిక రాజా.. వీడియో దొరికేసింది..
TDP Leader Gajula Khadar Basha Viral Video: నిన్న కాక మొన్నే సత్యవీడు టీడీపీ ఎమ్మెల్యే రాసలీలలు మరువక ముందే మరో టీడీపీ మంత్రిగారి అనుచరుడు పాడుపనికి పూనుకున్నాడు. టీడీపీ నేత గాజుల ఖాదర్ భాష ఏకంగా ఓ అమ్మాయితో రొమాన్స్ చేస్తోన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. రాత్రికి వస్తేనే పింఛన్, రేషన్ కార్డు, ఇంటి స్థలం అంటూ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఓ యువతి పేర్కొంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
TDP Leader Gajula Khadar Basha Viral Video: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. మొన్నటి వరకు కోనేటి ఆదిమూలం రాసలీలాల వీడియో బయట పడిన సంగతి తెలిసిందే. ఆయన సత్యవేడు ఎమ్మెల్యే. ప్రస్తుతం మరో టీడీపీ మంత్రి గారి ప్రధాన అనుచరుడి రాసలీలల వీడియో వైరల్‌గా మారింది. టీడీపీ నేత గాజుల ఖాదర భాష తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడి ఆరోపిస్తూ ఓ మహిళ వీడియో సోషల్ మిడియాలో హల్‌చల్ చేస్తోంది. ఓ ముస్లిం మహిళలను ఖాదర్ భాష లొంగదీసుకున్నాడని, తన వద్దకు వస్తేనే పింఛను, రేషన్ కార్డు ఇస్తానని లైంగిక దాడికి పాల్పడినట్లు సదరు మహిళ ఆరోపించింది. వీరు ఏకాంతంగా గడిపిన వీడియో ప్రస్తుతం సంచలనం రేపుతోంది.
ప్రస్తుతం ఖాదర్ భాష ఓ మంత్రిగారికి ప్రధాన అనుచరుడిగా ఉన్నాడు. గత ఎన్నికల్లో కూడా కుప్పం నియోజకవర్గం నుంచి కీలక పాత్ర పోషించాడు. మంత్రి గారికి నమ్మకస్తుడుగా ఉండటంతో ఖాదర్ భాష ఇలా అమ్మాయిలను మోసగించే పనులు చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు కూడా. మరోసారి టీడీపీ నేతల రాసలీలల వీడియో వైరల్ అవ్వడంతో ఆ పార్టీపై ఇతర పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఖాదర్ భాష విషయానికి వస్తే ఆయన ఓ మైనారిటీ సీనియర్ లీడర్. ముఖ్యంగా ఓ మంత్రిగారికి ప్రధాన అనుచరుడు బాధితురాలు సదరు నేతపై ఫిర్యాదు చేస్తే ఎంత వరకు ప్రభావం చూపుతుందో తెలియాలి. అయితే, కొందరు మాత్రం టీడీపీ లోని మరో వర్గం ఖాదర్ భాషను ఇరికించాలనే ఈ వీడియో సోషల్ మీడియాలో పెట్టారని అంటున్నారు. కాగా దీనిపై ఇంకా ఖాదర్ భాష స్పందించాల్సి ఉంది.
ఇదీ చదవండి : ఐఆర్‌సీటీసీలో కీలక మార్పు.. అడ్వాన్స్ బుకింగ్ గడువు 60 రోజులకు తగ్గింపు..!
గతంలో టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం తిరుపతిలోని ఓ హోటల్ గదికి పిలిచి ఓ యువతిని లొంగదీసుకున్నాడు. ఆమె కూడా సోషల్ మీడియా వేదికగా తనకు జరిగిన అన్యాయాన్ని పంచుకుంది. తనను బెదిరించి ఆదిమూలం లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు చెప్పింది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తనతో పాటు కుటుంబాన్ని చంపేస్తానని హెచ్చరించాడని తెలిపింది.కేవలం రాజకీయ కుట్రలో భాగం కావాలనే తనను ఇరికించారు. దీనికి తనకు ఎలాంటి సంబంధంలేదంటూ కూడా స్పష్టం చేశాడు ఆదిమూలం. ఆయన్ను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. కానీ, నాటకీయంగా ఆ మహిళ కేసును వెనక్కు తీసుకోవడం గమనార్హం.
ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో రోజుకో టీడీపీ నేతలు ఇలా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. రెండు వివాదాల్లో బాధిత మహిళలు సోషల్ మీడియా వేదికగా తమపై జరిగిన ఆరోపణలు చెప్పుకొచ్చారు. ఖాదర్ భాషపై మంత్రి గారు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter