Pushpa Dance Viral Video: పుష్ప సినిమా.. థియేటర్లలో విడుదలై ఎంతటి విజయాన్ని సాధించేందో సోషల్​ మీడియాలో కూడా అంతే స్థాయిలో ట్రెండ్ అయింది. సామాన్యుల నుంచి క్రికెటర్లు, సినిమా స్టార్స్​ వరకు ఈ సినిమా డైలాగ్స్​కు లిప్​ సింక్ చేయడమో లేదా.. ఈ సినిమా పాటలకు డ్యాన్సులు చేయడమో చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తన రీల్స్​ వీడియోలో వైరల్​​ సెన్షన్​గా మారిన స్పైస్​జెట్​ ఎయిర్​ హోస్టెస్​ ఉమా మీనాక్షి తాజాగా మరో వీడియోను పోస్ట్​ చేసింది. అయితే ఈ సారి అమె పుష్ప సినిమాలో 'శ్రీ వల్లి' హిందీ పాటకు స్టెప్పులేసింది. కాదు..కాదు.. అల్లు అర్జున్​ను ఇమిటెట్​ చేయేందుకు ప్రయత్నించింది.


ఖాళీ విమానంలో అమె అల్లు అర్జున్​ను ఇమిటేట్​ చేసేందుకు ప్రయత్నించింది. నిజానికి పుష్ప సినిమాలో అల్లు అర్జున్ స్లిప్పర్​ జారిపోయే స్టెప్పు అందరిని తెగ ఆకట్టుకుంది. అలానే ఉమా మీనాక్షి కూడా అదే స్టెప్పును ట్రై చేసింది. కానీ అమె హీల్స్ వేసుకోవడంతో అది వర్కౌట్​ కాలేదు.


దీనితో.. ఆ వీడియోలో చేస్తూనే అమె పక్కున నవ్వి పక్కకు తప్పుకుంది. దీనితో ఆ వీడియో కాస్త బ్లూపర్​గా మారిపోయింది. అయితే ఆమె వైరల్ సెన్షెన్​గా ఇప్పటికే గుర్తింపు పొందిన నేపథ్యంలో ఆ బ్లూపర్​ వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. ఫన్నీగా ఉండటం వల్ల ఆ వీడియోను చూస్తున్నారు.


రెండు రోజుల క్రితం ఆమె ఈ వీడియోను తన ఇన్​స్టాగ్రామ్ అకౌంట్​లో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్​ కింద స్లిప్పర్​ స్లిప్పింగ్​ డ్యాన్స్ ట్రై చేశాను కానీ.. నా కాలు విరిగిందనుకుంటా అని ఫన్నీగా రాసుకొచ్చింది.



విమానంలో డ్యాన్సులపై వివరణ..


ఇలా విమానాల్లో డ్యాన్స్ చేస్తే యాజమాన్యం ఏం అనదా? ప్లైట్​లో అలా డ్యాన్సులు చేయొచ్చా? అన్న సందేహాలకు కూడా అమె వివరణ ఇచ్చింది.


విమానం ఆగి ఉన్నప్పుటు, విమానంలో ఎవర్రూ లేని సమయంలోనే ఆ వీడియో తీసినట్లు చెప్పింది. ఇందుకు కావాల్సిన అన్ని అనుమతులు కూడా తీసుకున్నట్లు స్పష్టం చేసింది. తాను డ్యాన్స్ చేయడం వల్ల ఎవరికీ ఇబ్బంది కలగలేదని కూడా పేర్కొంది.


Also read: Viral Recipe Video: వామ్మో.. ఇదేం కాంబినేషన్! చట్నీతో పానీ పూరి ఐస్ క్రీమ్‌రోల్స్ ఎప్పుడైనా తిన్నారా?


Also read: Viral Video: బుడ్డోడు నిచ్చెన దిగే స్టైల్ చూస్తే షాకవ్వాల్సిందే.. ఎందుకో మీరే చూడండి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook