Viral news today: తన గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ ఫెయిల్ అవుతోందనని ఆమెలాగే రెడీ అయి ఎగ్జామ్ రాయడానికి వెళ్లాడు ఓ వ్యక్తి. ఈ షాకింగ్ ఘటన పంజాబ్ లో జరిగింది. ఇప్పుడు ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసలేం జరిగిందంటే..
జనవరి 7న కోట్కాపురాలోని డీఏవీ పబ్లిక్ స్కూల్‌లో బాబా ఫరీద్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ద్వారా బహుళ ప్రయోజన ఆరోగ్య కార్యకర్తల పరీక్ష నిర్వహించబడింది. ఫజిల్కాకు చెందిన అంగ్రేజ్ సింగ్ యెుక్క ప్రేమికురాలైన పరమ్‌జిత్ కౌర్ కు ఫరీద్‌కోట్‌లో ఎగ్జామ్ సెంటర్ పడింది. ఈ క్రమంలో తన గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ ఫెయిల్ అవుతోందనని ఆమె బదులు అంగ్రేజ్ సింగ్ ఎగ్జామ్ రాయాలని నిర్ణయించుకుంటాడు. 


ఈ క్రమంలో అతడు పరమ్‌జిత్ కౌర్ వేషం ధరించి పరీక్షా కేంద్రానికి వెళతాడు. ఆమెలాగే ఎరుపు రంగు బ్యాంగిల్స్, బిందీ, లిప్‌స్టిక్ మరియు లేడీస్ సూట్‌తో రెడీ అవుతాడు. ఈ నేపథ్యంలో తన వద్ద ఉన్న నకిలీ ఓటరు మరియు ఆధార్ కార్డులను ఉపయోగించి అధికారులను బోల్తా కొట్టించి లోపలికి వెళతాడు. అయితే లోపల అతడు బయోమెట్రిక్ పెట్టాల్సి ఉంటుంది. అతడు వేలిముద్రలు అసలైన అభ్యర్థి యెుక్క ఫింగర్ ఫ్రింట్స్ తో సరిపోలక పోవడంతో ఫ్లాన్ ఫెయిలై స్టాఫ్ కు పట్టుబడతాడు. దీనిపై పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Also Read: ఇండిగో పైలెట్ పై చేయి చేసుకున్న ప్రయాణికుడు…వీడియో వైరల్


Also Read: Haryana Dead Man: అద్భుతం.. చనిపోయిన వ్యక్తి మళ్లీ బతికాడు.. ఎలాగంటే..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook