IndiGo Shocking Incident: ఇండిగో పైలెట్ పై చేయి చేసుకున్న ప్రయాణికుడు…వీడియో వైరల్

Passenger Hits an IndiGo Pilot: ఇండిగో విమానంలో తాజాగా చోటు చేసుకున్న సంఘటన ప్రస్తుతం అందరిని ఆశ్చర్యపరిస్తోంది. విమానం ఆలస్యమవుతుందని పైలట్ అనౌన్స్మెంట్ చేస్తుండగా…ప్రయాణికుడు వెళ్లి పైలెట్ పై చేయించుకోవడం అక్కడ ఉన్న అందరిని షాక్ కి గురి చేసింది..

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 15, 2024, 11:41 AM IST
IndiGo Shocking Incident: ఇండిగో పైలెట్ పై చేయి చేసుకున్న ప్రయాణికుడు…వీడియో వైరల్

IndiGo Pilot: ఇండిగో ఫ్లైట్లో ఆశ్చర్యకరమైన ఒక ఘటన చోటుచేసుకుంది. విమానం ఆలస్యమైందని పైలట్ అనౌన్స్ చేస్తుండగా.. మా విమానంలో ఉన్న ఒక ప్రయాణికుడు ఆగ్రహానికి గురై.. కుప్పంతో తరిస్తూ వెళ్తూ ఆ పైలెట్ పై చేయి చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

 

కొన్ని వెబ్సైట్లో కథనం ప్రకారం.. ఇండిగో విమానం చాలాసేపు ఆలస్యం కావడంతో మునుపటి పైలట్ స్థానంలో మరో పైలట్ బాధ్యతలు తీసుకున్నారు. కాగా ఫ్లైట్ డ్యూటీ లిమిటేషన్స్ నిబంధనల ప్రకారం ఇలాంటి సందర్భాల్లో పైలట్ మార్పు అనేది ప్రయాణాలతో తప్పనిసరి. బడలిక కారణంగా జరిగే పొరపాట్లు నివారించేలా పైలట్లకు తగినంత విశ్రాంతినిచ్చేందుకు ఈ నిబంధనలను రూపొందించారు. నేపథ్యంలో విమానం ఆలస్యమైన విషయాన్ని ప్రయాణికులకు అనౌన్స్ చేస్తుండగా వెనక కూర్చున్న ఓ ప్రయాణికుడు .. విమానం ఆలస్యం అవుతుందని కోపానికి గురయ్యారు. దాంతో ఒక్కసారిగా ముందుకు దూసుకొచ్చి కోపంతో పైలట్‌పై చేయి చేసుకున్నాడు. ఈ దృశ్యం చూసి విమానం లో ఉన్న ప్రయాణికులు అందరూ ఆశ్చర్యపోయారు. అతడిని అడ్డుకున్నారు. 

కాగా ప్రయాణికుడి దురుసు ప్రవర్తనను నెటిజన్లు కందిస్తున్నారు. పైలెట్స్ కూడా మనలాంటి మనుషులే అని అలా వారి పైన చేయి చేసుకోవడం సరైనది కాదు అని కామెంట్లు పెడుతున్నారు. ఫ్లైట్ ఆలస్యంలో పైలట్ తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. 

పైలట్ తన బాధ్యత మాత్రమే నిర్వహిస్తున్నాడని.. కాబట్టి అతనిపై చేయి చేసుకుంటే తప్పు మనదే అవుతుంది అని చెయ్యి చేసుకున్న ప్రయాణికుడి పై తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. ఇలాంటి ప్రయాణికులకు మరోసారి విమానం ప్రయాణానికి అనుమతించకుండా నో ఫ్లై జాబితాలో చేర్చాలని... అతడిని అరెస్టు చేయాలని కూడా డిమాండ్ చేశారు. 

Also Read: Sankranthi Special Trains: సంక్రాంతి రద్దీ తట్టుకునేందుకు మరిన్ని ప్రత్యేక రైళ్లు

Also Read: Home Loan Rates: హోమ్‌ లోన్స్‌ గుడ్‌ న్యూస్‌..వడ్డీ రేట్లు తగ్గబోతున్నాయ్‌..

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

 

Trending News