King Cobra viral Video: ఈ భూమ్మిద అత్యంత విషపూరితమైన పాము కింగ్ కోబ్రా. ఇది కాటు వేస్తే మనిషైనా, జంతువు అయినా క్షణాల్లో ప్రాణాలు కోల్పోవాల్సిందే. కింగ్ కోబ్రా ఒక్క కాటు ఇరవై మంది వ్యక్తులను చంపగల శక్తివంతమైన న్యూరోటాక్సిన్‌ను కలిగి ఉంటుంది. అందుకే దీనిని చూస్తే జనాల గుండెలు అదిరిపోతాయి. వీటి సగటు పొడవు 4మీ. ఇవి ఎక్కువగా భారత ఉపఖండం, ఆగ్నేయాసియా ప్రాంతాల్లో కనిపిసతాయి. దాదాపు 100 మీ (330 అడుగులు) దూరంలో కదులుతున్న ఎరను గుర్తించగలదు. ఇది ఎక్కువగా పాములు మరియు బల్లులను తింటుంది. అప్పుడప్పుడు మనుషులపై కూడా దాడి చేస్తుంది. కింగ్ కోబ్రా సగటు జీవితకాలం సుమారు 20 సంవత్సరాల వరకు ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి పాములకుసంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి మరి ముఖ్యంగా కింగ్ కోబ్రాల వీడియోలు ఎక్కువగా నెట్టింట సందడి చేస్తున్నాయి. తాజాగా ఓ ఇంట్లో దూరిన కింగ్ కోబ్రా జనాలను హాడలెత్తించింది. 15 అడుగుల పొడవు గల కోబ్రాను చూసి అక్కడున్నవారు షాక్ తిన్నారు. దీంతో వారు పాములను పట్టే ఓ వ్యక్తిని పిలిచారు. అక్కడికి వచ్చిన స్నేక్ క్యాచర్ ను కోబ్రా ముప్పుతిప్పలు పెట్టింది. మెుత్తం మీద ఎలాగోలా ఎంతో చాకచక్యంగా పామును పట్టేశాడు ఆ వ్యక్తి. ఆ తర్వాత దానిని తీసుకెళ్లి అడవిలో విడిచిపెట్టాడు.ఈ వీడియోను ఫారెస్ట్ అధికారి సుశాంత్ నందా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు వేలల్లో లైక్స్ వచ్చాయి. అంతేకాకుండా నెటిజన్స్ తమదైన శైలిలో కామెంట్లు కూడా పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మీరు ఓ లుక్కేయండి.  



Also Read: Viral Video today: వామ్మో.. రైళ్లల్లో కూడా ఇలాంటి దృశ్యాలా.. వీడియో చూస్తే ఒళ్లు జలదరించడం పక్కా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook