Snake Viral Video: సాధారణంగా పాముల అంటేనే విష సర్పాలు. ఇవి ఎప్పటికీ ప్రాణాంతకమే. అయితే, సోషల్‌ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్‌ అవుతూ ఉంటాయి. ఈరోజు కూడా ఓ పాము ఏకంగా ఇంటి అల్మరాలో దాక్కుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంటి అల్మరాలో దాక్కున నాగు పాము భయంతో ఇంటి ఓనర్‌తోపాటు చుట్టుపక్కల వారు పరుగులు తీశారు. ముఖ్యంగా ఈ పాము ఆ ఇంట్లో వారిని భయబ్రాంతులకు గురిచేసింది. ఏటా ఎన్నో లక్షల మంది పాముకాటుకు గురవుతున్నారు. దీంతో వారు తమ ప్రాణాలను సైతం పోగొట్టుకుంటున్నారు. అందుకే జన జీవనంలో ఈ పాములు కనిపిస్తే భయబ్రాంతులకు గురవుతారు.


ఈ మధ్య భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పాములు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా ఇవి నివాస ప్రాంతాల్లోకి వెళ్తున్నాయి. ఇంటి పెరటి, ఆవరణ, ఈసారి ఏకంగా ఇంటి అల్మరాలోనే పాము నక్కిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ మారింది. ఓ 3 అడుగుల విషపూరితమైన నాగు పాము అల్మరాలో దూరి బుసలు కొడుతూ ఆ ఇంటి వారిని భయ భ్రాంతులకు గురిచేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్‌ పూర్‌లో చోటు చేసుకుంది.  సోమవారం ఓ 3 అడుగుల ఆడనాగు పాము అల్మరాలో దూరింది. దీంతో ఆ ఇంటి వారు బెంబేలెత్తి పోయారు.


ఇదీ చదవండి: ఈరోజు నుంచి మారనున్న 10 రూల్స్‌ ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి..  


ఇది ఇందిరా నగర్‌లోని శారద బస్తీలో చోటు చేసుకుంది. ఇది గర్హా జబల్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోకి వస్తుంది.  ఆ ఇంట్లోవారు అల్మరా తీయగానే ఒక్కసారిగా బుసలు కొడుతూ పైకి లేచింది. దీంతో ఆ ఇంటివారు ప్రాణభయంతో బయటకు పరిగెత్తారు. స్నేక్‌ క్యాచర్‌కు వెంటనే పాము గురించిన సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకుని పామును పట్టుకున్నారు. ఎవరికీ ఏ హాని కలుగుండా ఆడవిలో వదిలేశారు. గజేంద్ర దూబే ప్రకారం ఈ పాము అత్యంత విషపూరితమైంది. 


 


 




 


ఇదీ చదవండి: పెత్తర అమావాస్యకు బిగ్ షాక్ ఇచ్చిన గాంధీ తాత.. ఆ రెండు లేకుంటే ఎలా?  


మరో ఘటనలో ఓ పచ్చరంగులో ఉండే ఓ పాము ఏకంగా ట్రైన్‌ కోచ్‌ ఏసీలో నుంచి బయటకు వచ్చింది. ఈ ఘటన సెప్టెంబర్ 25న చోటు చేసుకుంది.  అజ్మిర్‌ నుంచి జబల్‌పూర్‌ దయోదయా ఎక్స్‌ప్రెస్‌ ఏసీ కోచ్‌లో పాము కనిపించింది. దీంతో ప్రయాణీకులు కూడా ఒక్కసారిగా భయబ్రాంతులకు లోనయ్యారు. అంతేకాదు సెప్టెంబర్ 22వ తేదీన జబల్‌పూర్‌ ముంబై గరిబ్‌రథ్‌ ఎక్స్‌ప్రెస్‌లో ట్రైన్‌ హ్యాండిల్‌కు చుట్టుకుని కనిపించింది. ఇది కూడా నెట్టింటా వైరల్‌ గా మారింది.‌


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.