Funny Video: ప్రస్తుతం పెళ్లిళ్లకు సంబంధించి చాలా సన్నివేశాలు నెట్టింట వైరల్‌(Social Media)గా మారుతున్నాయి. వివాహ అనంతరం సంబరాల్లో ఆనందంగా నోట్లను గాలిలోకి విసరడం..దానిని పిల్లలు పోటాపోటీగా వెళ్లి వాటిని తీసుకోవడం వంటివి సినిమాల్లో చూసి ఉంటారు. అయితే ఇటీవలే ఇలాంటి సంఘటనకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. పెళ్లి సంబరాల్లో ఇద్దరు వ్యక్తులు ఓ ఐటమ్‌ సాంగ్‌కు డ్యాన్స్‌ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి తన జేబులో ఉన్న డబ్బుల నోట్ల కట్టను చూపిస్తూ స్టెప్పులు వేస్తాడు. అయితే రెండో వ్యక్తి  మైకంలో ఆ డబ్బులను గాల్లో విసురుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తే మీరు పడి పడి నవ్వుకుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


చేతిలోని నోట్లను లాక్కొని గాలిలో విసిరాడు:
అతను చేతిలోని నోట్లను లాక్కొని గాలిలో విసరడంతో అందరూ వచ్చి ఆ నోట్ల తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతారు. అయితే ఆ వ్యక్తి కోపంతో తన స్నేహితులను మందలిస్తాడు. కానీ అతని స్నేహితులు ఆ వ్యక్తి మాటలను లైట్‌ తీసుకొని విచ్చల విడిగా నవ్వుతారు. ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండ్‌గా మారింది.


[[{"fid":"231797","view_mode":"default","fields":{"format":"default"},"type":"media","field_deltas":{"2":{"format":"default"}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


ఈ వీడియోను చూసిన నెటిజన్లు లైక్‌ల వర్షం కురిపిస్తున్నారు. ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో 'నిఖాదు హర్యాన్వి' అనే ఖాతా  ద్వారా షేర్ చేశారు. చాలా మంది ఇతర వినియోగదారులు కూడా ఈ వీడియోపై తమ అభిప్రాయాన్ని తెలియజేశారు.


Also Read: Pudina Health Benefits: జీర్ణక్రియ నుంచి రక్త ప్రసరణ వరకూ..పుదీనాతో అద్భుత ప్రయోజనాలు


Also Read: Optical Illusion Photo: ఈ చిత్రంలోని ఆకుల మధ్య ఓ కప్ప దాగుంది! అదెక్కడ ఉందో కనిపెడతారా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook