Optical Illusion Photo: ఈ చిత్రంలోని ఆకుల మధ్య ఓ కప్ప దాగుంది! అదెక్కడ ఉందో కనిపెడతారా?

Optical Illusion Photo: సోషల్ మీడియాలో ప్రస్తుతం పజిల్స్ ట్రెండ్ నడుస్తోంది. ప్రస్తుతం అనేక ఆప్టికల్ ఇల్యూషన్ కు సంబంధించిన పిక్స్ వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమం ఆకుల మధ్య దాగున్న కప్ప ఫొటో ఒకటి విపరీతంగా హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఆ చిత్రంలో కప్ప ఎక్కడ ఉందో తెలుసా?  

Written by - ZH Telugu Desk | Last Updated : May 19, 2022, 09:24 AM IST
Optical Illusion Photo: ఈ చిత్రంలోని ఆకుల మధ్య ఓ కప్ప దాగుంది! అదెక్కడ ఉందో కనిపెడతారా?

Optical Illusion Photo: మొదటిసారి ఈ చిత్రాన్ని చూసిన వెంటనే అందులు చెట్టు కొమ్మ, దాని ఆకులు మాత్రమే కనిపిస్తాయి. అవి తప్ప ఇందులో మరేవి లేవు కదా! అని అనుకుంటున్నారా? అయితే మీరు కూడా పప్పులో కాలేసినట్లే! మీరు చూస్తున్న ఈ చిత్రంలోని ఆకుల మధ్యన ఓ జీవి దాగుంది. అదే కప్ప. అయితే కళ్లను మాయచేసే ఈ పిక్ లో కప్ప ఎక్కడ ఉందో కనిపెట్టడంలో చాలా మంది విఫలమయ్యారు. మీరు కప్పను కనుగొంటే మేధావులు మీరే!

కప్పను గుర్తించారా?

చెట్టుపై పచ్చని ఆకుల మధ్య కప్ప దాగున్న ఫొటో ఇప్పుడు ఇంటర్నెట్ లో తెగ వైరల్ గా మారింది. దాన్ని కనుగొనడంలో చాలా మంది విఫలమయ్యారు. ఈ చిత్రంలో కప్పను చూస్తే మీ కళ్లను మీరే నమ్మలేని విధంగా ఉంటుంది. ఈ పిక్ ను మాక్రో ఫొటోగ్రఫీకి ఫేమస్ అయిన ఇండియన్ ఫొటోగ్రాఫర్ యువరాజ్ గుర్జార్ తీశాడు. 

యువరాజ్ తన కెమెరాలో బంధించిన ఈ చిత్రంలో కప్ప దాగుడడం అందర్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే ఇంతటి ఆప్టికల్ ఇల్యూషన్ కలిగిన ఈ పిక్ లో కప్ప అంత సులభంగా కనిపించదు. ఈ ఫొటోను చాలా నిశీతంగా పరిశీలించాల్సి ఉంటుంది. అయితే దాన్ని కనిపెట్టడంలో చాలా నెమ్మదిగా ఉండాలి. కొన్నిసార్లు కప్ప జాడ కనిపెట్టడం లో చాలా మంది విఫలమయ్యారు. కనీసం మీరైనా కనుగొంటే మీరు మేధావులే అవుతారు. 

కప్ప ఎక్కడ ఉందంటే?

మీరు చిత్రాన్ని చూసి విసిగిపోయారా? మీరు ఇప్పటికీ చిత్రంలో కప్పను చూడకపోతే, మేము మీకు క్లూ ను అందిస్తాము. ఆకుల పైన కూర్చున్న కప్ప పసుపు కన్ను కనిపిస్తుంది. మరోసారి చిత్రాన్ని చూడండి. కింది చిత్రంలోని సర్కిల్ లో కప్ప ను చూడవచ్చు. 

Also Read: Funny Viral Video: పెళ్లిపందిరిలో కోపంతో పెళ్లి కుమార్తె ఎంత పని చేసిందో చూడండి!

Also Read: Currency Note Bidding: అవును.. ఆ కరెన్సీ నోటు విలువ ఏకంగా రూ. 1.30 కోట్లు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News