Cat Viral Video: పెంపుడు జంతువులు (పెట్స్​) అనగానే ముందుగా గుర్తొచ్చేవి కుక్కలు, పిల్లులు. చాలా మంది ఎంతో ఇష్టంగా వాటిని పెంచుకుంటారు. ఇంట్లోని కుటుంబ సభ్యుల్లో ఒకరిగా వాటిని చూస్తుంటారు. ఆ జంతువులు కూడా.. తమను పెంచుకునే వారితో ఎంతో స్నేహంగా మెలుగుతుంటాయి. అది మాత్రమే కాదు.. తమను పెంచుకునే వారి అలవాట్లకు, అభిరుచులకు తగ్గట్లుగా నడుచుకుంటుంటాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉదాహరణకు..  ఎంతో మంది తమ పెంపుడు కుక్కలకు బాల్ విసిరితే తెచ్చివడం, ఇంటికి వచ్చినప్పుడు ఎంతో ఆప్యాయంగా హత్తుకోవడం వంటివి చేస్తుంటాయి ఆ పెంపుడు జంతువులు. అలా మనుషులు, జంతువుల మధ్య ఆప్యాయకు సంబంధించిన వీడియోలు ఎన్నో చూసి ఉంటారు.. కానీ తాజాగా ఓ కొత్త వీడియో వైరల్ అవుతోంది. అది మనుషులు జంతువుల మధ్య.. ప్రేమను మరో లెవల్​కి తీసుకెళ్తోంది..


ఇంతకీ వీడియోలో ఏముంది?


ఇంట్లో చిన్నపిల్లలతో కుక్క పిల్లలు, పిల్లులు స్నేహంగా మెలుగుతుంటాయి. ఆ పిల్లల తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు చేసే పనులను గుర్తుంచుకుని అవి కూడా ఆ చిన్నారులతో అలానే మెలుగుతుంటాయి.


తాజాగా ఓ పిల్లి తమ.. ఓ చిన్నారికి మాసాజ్​ చేసింది. బెడ్​పై పడుకున్న చిన్నారి వీపుపై.. ఆ పిల్లి ముందువైపు కాళ్లతో నెమ్మదిగా తొక్కుతూ మసాజ్​ చేసింది. ఆ చిన్నారికి ఏ మాత్రం అసౌకర్యం కలగకుండా ఆ పిల్లి మసాజ్ చేయడం విశేషం.


ఇందుకు సంబందించిన వీడియోను Buitengebieden అనే ట్విట్టటర్ యూజర్ షేర్​ చేశారు. ఆ వీడియోలో చిన్నారికి మాసాజ్ చేస్తున్న వీడియో ఉంది. అందులో మా పిల్లి మా చిన్నారికి ప్రేమతో మాసాజ్ చేస్తోంది అని ఇంగ్లీష్​లో రాసి ఉంది.



ఈ వీడియోను ఇప్పటికే 3 లక్షల మంది వరకు చూశారు. చూసిన ప్రతి ఒక్కరూ పిల్లి, చిన్నారి మధ్య స్నేహానికి ఫిదా అవుతున్నారు. అంతే కాదు ఆ వీడియోను రీ ట్వీట్​ చేస్తూ.. మసాజ్ టైమ్​ అని కొందరు మరికొంతరేమో.. ఇలాంటి క్యూట్ పిల్లి నాకు కావాలి అంటూ స్పందిస్తున్నారు.



మరికొంతరేమో తమ ఇంట్లో ఉన్న పిల్లులు తమతో ఎంత స్నేహంగా ఉంటాయో చెబుతూ వీడియోలను షేర్ చేస్తున్నారు. మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోలను మీరు చూసేయండి ఇప్పుడే.


Also read: Viral Video: కానిస్టేబుల్​పై ఘోరంగా దాడి చేసిన ఎద్దు.. షాకింగ్ వీడియో


Also read: Viral Puzzle: ఈ చిత్రంలో ఎన్ని 3 అంకెలు ఉన్నాయో చెప్పగలరా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


pple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook