Viral Video: కానిస్టేబుల్​పై ఘోరంగా దాడి చేసిన ఎద్దు.. షాకింగ్ వీడియో

Viral Video: విధులు నిర్వహిస్తున్న ఓ పోలీస్​ కానిస్టేబుల్​పై ఎద్దు ఒక్కసారిగా దాడి చేసింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఆ కానిస్టేబుల్ పరిస్థితి ఎలా ఉంది?

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 5, 2022, 06:47 PM IST
  • పోలీస్​ కానిస్టేబుల్​పై ఎద్దు దాడి
  • కొమ్ములతో పైకెత్తి విసిరిన ఎద్దు..
  • నెట్టింట వైరల్​గా మారిన వీడియో
Viral Video: కానిస్టేబుల్​పై ఘోరంగా దాడి చేసిన ఎద్దు.. షాకింగ్ వీడియో

Viral Video: ఏ జీవైనా తనకు హాని ఉందని భావిస్తే తప్పా దాడి చేయవు.. అని చాలా మంది చెబుతుంటారు. అయితే ఈ మాట అన్నిసార్లు నిజమ కాకపోవచ్చు. ముఖ్యంగా సాదు జీవులుగా భావించే జంతువల్లో కూడా. అప్పుడప్పుడు కొన్ని జంతువులు ఉన్నట్టుండి దాడి చేయడం వంటివి చేస్తుంటాయి.

అలాంటి ఘటనతే తాజాగా ఢిల్లీలో జరిగింది. ఓ పోలీస్​ కానిస్టేబుల్ తన విధులు నిర్వహిస్తున్న సమయంలో ఓ ఎద్దు అయనపై దాడి చేసింది. ఎక్కడైన అటవీ ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ ఎద్దు దాడి చేసిందనుకుంటే పొరపాటే.. నడి రోడ్డుపై ఉన్నప్పుడు ఆ ఎత్తు కానిస్టేబుల్​ను కొమ్ములతో పైకెత్తి విసిరింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

ఇంతకీ ఏం జరిగిందంటే..

ఢిల్లీ దయాల్పూర్​లోని షేర్​పూర్​ చౌక్ వద్ద విధులు నిర్వహిస్తున్నాడు ఓ కానిస్టేబుల్​. అయితే రోడ్డు దాటి అవతలి నుంచి ఇటువైపుగా వచ్చిన ఆ కానిస్టేబుల్ వెనక ఓ ఎద్దు నిలబడి ఉంది. అయితే ఆ ఎద్దు అప్పటి వరకు ప్రశాంతంగానే ఉన్నా.. ఒక్కసారిగా కానిస్టేబుల్​ను వెనక నుంచి కొమ్ములతో పైకెత్తి విసిరింది.
ఆ తర్వాత ఎద్దు పక్కకు వెళ్లగా.. కానిస్టేబుల్ మాత్రం కింద పడి అలానే ఉండిపోయాడు. దీనితో పక్కనే ఉన్న వాళ్లు, తోటి కానిస్టేబుల్​ పెరిగెత్తుకుంటూ వచ్చి సహాయం చేశారు. స్వల్ప గాయాలైన ఆ కానిస్టేబుల్​ను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స చేసి డిశ్చార్చ్​ కూడా చేశారు.

అయితే ఇందుకు సంబంధించిన సీసీ టీవీ వీడియో మాత్రం ఇప్పుడు నెట్టింట వైరల్​గా మారింది. ప్రముఖ జర్నలిస్ట్​ అభిమన్యూ కులకర్ణి ఈ వీడియోను షేర్​ చేశారు. దీనిపై నెటిజన్లు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు. విధుల్లో ఉండి ఫోన్​ చూస్తున్నందుకు ఎద్దు శిక్ష విధించిందని ఓ వ్యక్తి స్పందించగా.. మరికొందరేమో భయంకరమైన దాడి చేసిందంటూ కామెంట్ చేశాడు. ఆ వీడియోను మీరూ చూడండి.

Also read: Saving Schemes: మీరు సీనియర్ సిటిజెన్ అయితే...మీ కోసం అద్భుతమైన పధకాలేంటో తెలుసుకోండి

Also read: Viral Puzzle: ఈ చిత్రంలో ఎన్ని 3 అంకెలు ఉన్నాయో చెప్పగలరా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

pple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News