Elephant and a Man Conversation Video: ఏనుగు మాట్లాడగలదా.. అంటే ఎవరైనా మాట్లాడలేదనే చెబుతారు. నిజమే.. ఏనుగు మాట్లాడలేదు. కానీ అది తన భావాలను శబ్ధాల ద్వారా వ్యక్తం చేయగలదు. ఉదాహరణకు.. ఏనుగు చాలా కోపంతో ఉన్నప్పుడు పెద్దగా ఘీంకరిస్తుంది. మనలో చాలామంది సినిమాల్లోనో, ప్రత్యక్షంగానో ఇది చూసే ఉంటారు. అయితే ఏనుగులు ఘీంకరించడం కాదు తమ వాత్సల్యాన్ని కూడా చాటుతాయి. తమను ప్రేమగా చూసుకునే యజమానుల పట్ల అవి కూడా అంతే ప్రేమ భావంతో ఉంటాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఏనుగు యజమాని పట్ల తన ప్రేమను శబ్ధం రూపంలో వ్యక్తం చేయడం గమనించవచ్చు. ఆ వ్యక్తి ఏనుగుతో మాట్లాడుతుంటే అది శబ్దాల ద్వారా ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తోంది. ఇద్దరి మధ్య ఈ సంభాషణ భలే ఆసక్తికరంగా ఉంది. మధ్యలో కొద్దిసేపు మోటార్ సౌండ్ కాస్త డిస్టర్బ్‌గా అనిపించినప్పటికీ.. ఆ తర్వాత వచ్చే ఫీల్ గుడ్ బీజీఎం బాగుంది.


'సూర్య  పుత్రన్ కర్ణన్' అనే ఇన్‌స్టా ఖాతాలో ఈ వీడియో అప్‌లోడ్ అయింది. నాలుగు రోజుల క్రితం అప్‌లోడ్ అయిన ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. లవ్ ఎమోజీలతో నెటిజన్లు ఈ ఏనుగు వీడియోపై తమ ఇష్టాన్ని వ్యక్తపరుస్తున్నారు. వీడియోపై మీరూ లుక్కేయండి...



Also Read: Constable Hall Ticket 2022: తెలంగాణలో కానిస్టేబుల్ రాత పరీక్షకు అంతా రెడీ..హాల్ టికెట్లు ఇలా పొందండి..!


Also Read: హిందీలో కార్తికేయ 2కి బ్రహ్మరధం.. 50 షోలతో మొదలై 3000 దాకా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook