Grandma English Slang Video: ఇంగ్లీష్‌ భాషకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్‌ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇంగ్లీష్‌ వర్డ్స్‌ ప్రొనౌన్సియేషన్‌ దేశాన్ని బట్టి కాస్త మారుతూ ఉంటుంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా అంతటా ఇంగ్లీష్‌ భాష ఒకేలా ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ప్రస్తుతం చదువులన్నీ కూడా ఇంగ్లీష్‌ మీడియంలో కొనసాగుతూ ఉన్నాయి. చిన్న‌ప్పటి నుంచి చాలా మంది స్టూడెంట్స్‌ ఇంగ్లీష్ మీడియంలోనే చదువులు కొనసాగిస్తున్నారు. మాండ‌లికం ఏదైనా సరే ఇంగ్లీష్ భాష విషయంలో మాత్రం అందరి ప్రొనౌన్స్‌ ఒకే తీరులో ఉంటుంది.


అయితే పాత రోజుల్లో ఇంగ్లీష్ భాష ఎలా ఉండేది.. పలు ప్రాంతాల్లో జనం ఇంగ్లీష్ ప‌దాల్ని ఎలా ఉచ్చరించేవారు అనే విషయం చాలా మందికి తెలియదు. ప్రస్తుతం ఉన్న ఇంగ్లీష్‌కు పాతకాలంలో మాట్లాడే ఇంగ్లీష్‌కు చాలా వ్యత్యాసం ఉండేది. 


గతంలో వివిధ ప్రాంతాల్లో ఇంగ్లీష్‌ను వివిధ రకాలుగా ఉచ్చరించేవారు. తాజాగా కశ్మీర్‌కు చెందిన ఒక బామ్మ మాట్లాడిన ఇంగ్లీష్‌ పదాలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.



పలు పదాలను కశ్మీరీ ఇంగ్లీష్ యాస‌లో ఈ బామ్మ ఉచ్చరించిన తీరు ఆకట్టుకుంటోంది. స‌య్య‌ద్ స్లీత్‌ షా అనే ఆయన ముప్పై సెకన్లు ఉన్న ఈ వీడియోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బామ్మ‌ ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్‌ అదిరిపోయిదంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ఈ వీడియో ఫుల్ వైరల్ అవుతోంది. 


Also Read: AP Corona: ఏపీలో తగ్గుతున్న కొవిడ్ తీవ్రత- నైట్​ కర్ఫ్యూ ఎత్తేసిన ప్రభుత్వం


Also Read: Sreemukhi Love: శ్రీముఖికి ప్రపోజ్ చేసిన వ్యక్తి.. ఒకే చెప్పేసిందట..?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook