Sreemukhi Love: ప్రపోజ్ చేసిన వెంటనే ఒప్పేసుకున్న శ్రీముఖి.. అతడెవరంటే..?

Sreemukhi Love: ప్రముఖ టీవీ యాంకర్ శ్రీముఖి ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై శ్రీ ముఖి స్వయంగా హింట్ ఇచ్చింది. అమె ఇంకా ఏం చెప్పిందంటే..

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 15, 2022, 08:13 AM IST
  • వాలెంటైన్స్ డే రోజు శ్రీముఖి సర్​ప్రైజ్​
  • బెస్ట్ వాలెంటైన్స్ డే అంటూ ట్వీట్​
  • లవ్​ ఓకే అయ్యిందా అంటున్న నెటిజన్లు!
Sreemukhi Love: ప్రపోజ్ చేసిన వెంటనే ఒప్పేసుకున్న శ్రీముఖి.. అతడెవరంటే..?

Sreemukhi Accepted his Love  Proposal: బుల్లితెర యాంకర్లలో శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందంతో పాటు స్పాంటినిటి.. స్పీడ్, యాస అన్ని తెలిసిన యాంకర్​గా అమెకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఫీమేల్ యాంకర్లలో టాప్​-5లో శ్రీముఖి కూడా ఒకరు అంటే అతిశయోక్తి కాదు.

ఇంతకూ ఆమె గురించి ఇప్పుడు చర్చ ఎందుకు వచ్చింది అంటారా? ఆ విషయానికే వస్తున్నాం..

అసలు మ్యాటర్​ ఏమింటంటే..

నేడు ప్రేమికుల దినోత్సవం (ఫిబ్రవరి 14). ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఈ రోజు తాము ప్రేమిస్తున్న వారికి ప్రపోజ్ చేస్తుంటారు. ఎందుకంటే ఈ ప్రత్యేకమైన రోజు మరింత స్పెషల్​గా చేసుకునేందుకు. ఇప్పటికే లవ్​లో ఉన్నవారు మరింత స్పెషల్​గా ఈ రోజును జరుపుకుంటారు.

శ్రీ ముఖి ఓకే చెప్పిందా..!

తాజాగా శ్రీ ముఖి కూడా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా సోషల్​ మీడియాలో తన ఫొటోను షేర్ చేస్తూ.. ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది.

'ఫిబ్రవరి 14 2022 ఈ రోజు.. ఈ రోజు గుర్తు పెట్టుకోండి మళ్లీ మాట్లాడుకుందాం. బెస్ట్ వాలెంటైన్స్ ఎవర్​' అని ఓ ట్వీట్​ చేసింది. ఈ ట్వీట్​లో హార్ట్​ సింబల్స్, లవ్​ సింబల్స్​తో కూడిన స్మైలింగ్ ఫేస్​ ఈమోజీలను జోడించింది శ్రీముఖి. ఇక ఫోటోలో శ్రీముఖి ఓ ఫ్లవర్ బొకే పట్టుకుని ఉంది.

పోస్ట్​లో ఉన్న లైన్స్​ను, ఫోటోను చూస్తే.. శ్రీముఖి ప్రేమలో పడినట్లు తెలుస్తోందంటున్నారు నెటిజన్లు. ప్రేమికుల రోజు తనకు ప్రపోజ్​ చేయగా.. తాను అంగీకరించినట్లు అర్థమవుతోందని చర్చించుకుంటున్నారు.

తాను ఓకే చెప్పిన ఆ వ్యక్తి ఎవరు? అనే విషయంపై మాత్రం శ్రీముఖి క్లారిటీ ఇవ్వలేదు. దీనితో సోషల్ మీడియాలో శ్రీ ముఖి బాయ్​ ఫ్రెండ్ ఎవరా..? అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. మరి అతడెవరో తెలియాలంటే.. శ్రీముఖి నుంచి గానీ.. అవతలి వ్యక్తి నుంచి గానీ అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

Also read: Vijay Beast first Lyrical song: వాలంటైన్స్​ డే స్పెషల్... విజయ్‌ 'బీస్ట్‌' నుంచి తొలి లిరికల్‌ సాంగ్‌ రిలీజ్..

Also read: Oh My Aadhya Song: ఓ మై ఆద్య అంటూ రష్మిక వెంటపడుతోన్న శర్వానంద్‌!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News