Man doing Exercise by hanging from road sign board in Haryana: రోజూ వ్యాయామం చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే.. దాని వలన మనకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. శరీరం ఫిట్‌గా ఉండడంతో పాటు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. వ్యాయామాలు చేయాలంటే జిమ్‌కి వెళ్లాలి. ఎందుకంటే అక్కడే అన్ని ఫిట్‌నెస్‌కి సంబంధించిన మిషన్స్ ఉంటాయి. జిమ్‌కి వెళ్లాల్సిన అవసరం లేకుండా.. ఇంట్లో కూడా కొన్ని వస్తువులతో వ్యాయామం చేస్తుంటారు కొందరు. మరికొంతమందికి వ్యాయామం చేయడానికి సమయం ఉండదు. అలాంటివారు తమకు అందుబాటులో ఉన్న వాటితో కానిచ్చేస్తుంటారు. అయితే ఓ వ్యక్తి ఏకంగా పెద్ద సాహసమే చేశాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓ వ్యక్తి హైవేపై ఉండే హోర్డింగ్‌కు వేలాడుతూ వ్యాయామం చేస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. హర్యానాలోని బాద్లీకి సమీపంలో గల ఫరూఖాబాద్ వద్ద దిశ, దూరాన్ని చూపించే పెద్ద బోర్డు ఉంది. ఓ వ్యక్తి దానిపైకి ఎలా ఎక్కాడో తెలియదు కానీ.. బోర్డు కింద బాగాన ఉన్న రాడ్డు పట్టుకుని వేలాడుతూ వ్యాయామం చేశాడు. మాములుగా నేలపై చేసినట్టుగానే ఓ రాడ్డును తన రెండు చేతులతో పట్టుకుని అటూఇటూ వెళుతూ వ్యాయామం చేశాడు.


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by ROYAL CARS © (@royalcarsz)


ఈ వీడియోను royalcarsz అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. 12 సెకన్ల నిడివి గల ఈ వీడియోను చూసి ప్రజలను ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ వీడియోను ఇప్పటి వరకు 10 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోను చూసిన ఓ యూసర్ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అక్కడి నుంచి పడిపోతే చేతులు మరియు కాళ్ళు విరిగిపోతాయి అని ట్వీట్ చేశాడు. చాలా మంది అతడు ఓ మూర్ఖుడు అని అంటున్నారు. 'వ్యాయామం చేయడానికి ఇంకో ప్లేస్ దొరకలేదా నాయనా', 'అక్కడి నుంచి పడితే కథ కంచికే' అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. 


Also Read: Anasuya Bharadwaj Pics: అనసూయ పరువాల విందు.. కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోన్న జబర్దస్త్ అందం!


Also Read: Kalyani Priyadarshan Pics: కళ్యాణి ప్రియదర్శన్ హాట్ షో.. బ్యాక్ మొత్తం చూపిస్తూ..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook