Mokksha Sengupta Protest dance on Kolkata doctor murder case video: కోల్ కతా జూనియర్ డాక్టర్ పై హత్యచార ఘటన దేశంలో పెనుదుమారంగా మారిందని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో.. దీనిపై ఇప్పటికి  కూడా కోల్ కతాలో నిరసనలు కొనసాగుతున్నాయి. సుప్రీంకోర్టు చెప్పిన కూడా జూనియర్ డాక్లర్ లు ఏమాత్రం వెనక్కు తగ్గడంలేదు. మరోవైపు మమతా సర్కారు నుంచి ఇప్పటి వరకు జూనియర్ డాక్టర్లకు 5 సార్లు చర్చలకు రావాలని కూడా పిలుపు అందింది. ఎట్టకేలకు కొన్ని డిమాండ్ లను మమతా సర్కారు ముందు ఉంచి, చర్చలకు వస్తున్నట్లు కూడా డాక్టర్ లు తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ఇదిలా ఉండగా.. ఇప్పటికి ఈ కేసులో.. సీబీఐ అధికారులు ముగ్గురిని అరెస్టు చేశారు. సంజయ్ రాయ్, సందీప్ ఘోష్ తో పాటు, మండల్ అనే పోలీసును అరెస్ట్ చేశారు. తాజాగా, ఈ ఘటన వెనుకాల టీఎంసీ ఎమ్మెల్యే హస్తమున్నట్లు కూడా వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయి. ఇదిలా ఉండగా.. కోల్ కతాలో..ఆగస్టు 6 న జరిగిన ఘటనను నిరసిస్తూ.. నటి, డ్యాన్సర్ మోక్షా సేన్‌గుప్తా (Mokksha Sengupta) ఆవేశంగా చేసిన డ్యాన్స్‌ వైరల్‌గా మారింది.


పూర్తి వివరాలు..



పశ్చిమ బెంగాల్ హత్యాచార ఘటనను నిరసిస్తూ నటి, డ్యాన్సర్ మోక్షా సేన్‌గుప్తా (Mokksha Sengupta)  ఆవేశంగా చేసిన డ్యాన్స్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఎన్‌జీఓ సంస్థ దక్షిణ కోల్‌కతాలో వీధిలో ప్రదర్శనలు నిర్వహిస్తుండగా ఈ నటి డ్యాన్స్ చేసినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో ఆమె అందరి ముందే మాస్ స్టెప్పులతో.. రౌద్రంగా భద్రకాళిలా పవర్ ఫుల్ స్టెప్పులు వేసింది.


ఆమె ముఖంపై ఉన్న ఫెస్ ఎక్స్ ప్రెషన్స్ సైతం.. చాలా రౌద్రంగా ఉన్నాయి. ఆమె చేసిన పవర్‌ఫుల్ డ్యాన్స్ అందరినీ షాకింగ్ కు గురిచేసిందని చెప్పుకొవచ్చు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. దీన్ని చూసిన నెటిజన్ లు భద్రకాళీ వచ్చి డ్యాన్స్ చేస్తుందా.. అంటూ  కామెంట్లు చేస్తున్నారు.  


Read more: Viral Video: వినాయక నిమజ్జనం వేళ అద్భుతం.. గణపయ్య మెడలో చేరిన నాగు పాము.. వీడియో వైరల్..


ఇదిలా ఉండగా.. ఈఘటనపై మోక్ష(Mokksha Sengupta) స్పందించారు. ఈ దారుణం జరిగినప్పుడు హైదరబాద్ లో ఉన్నట్లు తెలిపారు. ఆ తర్వాత సొంత ప్రదేశానికి వచ్చి నిరసనల్లో పాల్గొన్నట్లు తెలిపారు. మోక్ష తెలుగు మూవీస్ లలో నటించారు..అలనాటి రామచంద్రుడు’, ‘నీతోనే నేను’, ‘ ‘ఐ హేట్‌ యూ’ వంటి చిత్రాలలో నటించి అందరిని ఫిదా చేశారు. అదేవిధంగా తాజాగా..  ధన్‌రాజ్‌, సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘రామం రాఘవం’ చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఇది అతి తొందరలోనే..ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.