Monkey Viral Video: సోషల్ మీడియాలో ఈ మధ్య జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. వీక్షకులు కూడా ఎక్కువగా అలాంటి కంటెంట్ ను చూసేందుకే ఇష్టపడుతున్నారు. కోతులకు సంబంధించిన వీడియోలు నెట్టింట (Social Media) ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా అలాంటి కోతి వీడియో (Monkey Video) ఒకటి హల్ చల్ చేస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ వీడియో ఓపెన్ చేస్తే...మెక్సికన్ జంతుప్రదర్శనశాలలో మాక్సిమిలియానో ​​ఇబార్రా (Maximiliano Ibarra) అనే ఒక సందర్శకుడు ఒక పెద్ద గాజు కిటికీ ద్వారా ఒక ఆవరణలో ఉన్న ఒక కోతి ముందుకు వస్తాడు. ఇబార్రా దాని ముందు ఒక మ్యాజిక్ ట్రిక్ (Magic trick) చేయాలనుకుంటాడు. ఒక ఆకును తన వేళ్లతో  పట్టుకుని...కోతి ముందే మాయం చేస్తాడు. అది చూసిన మంకీ అవాక్కు అవుతోంది. తర్వాత కోతి హావాభావాలు మనల్ని షాక్ కు గురిచేస్తాయి. అంతలా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.



Also Read: Funny Accident Video: ఈ ఫన్నీ యాక్సిడెంట్ లో తప్పు ఎవరిదో మీరే కనిపెట్టండి?


ఈ కోతి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో కోతి రియాక్షన్స్ కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.  ఈ వీడియోను మెుదట  టిక్‌టాక్‌లో షేర్ చేశారు. అక్కడ దీనికి 2 మిలియన్లకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఈ వీడియో మెక్సికో నగరంలోని చాపుల్టెపెక్ జూలో (Mexico Chapultepec Zoo) రికార్డ్ చేయబడింది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook