Funny Accident Video: ఈ ఫన్నీ యాక్సిడెంట్ లో తప్పు ఎవరిదో మీరే కనిపెట్టండి?

Funny Accident Video: గూగుల్ లో ఎప్పటికప్పుడు అనేక రకాల వీడియోలు ట్రెండ్ అవుతూ ఉంటాయి. అన్నింటికంటే ఫన్నీ వీడియోలు ఎక్కువ ప్రజాదరణ పొందుతాయి. అలాంటి కోవకు చెందిన ఓ ఫన్నీ యాక్సిడెంట్ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే ఆ ఫన్నీ యాక్సిడెంట్ లో తప్పు ఎవరిదో తెలియడం లేదు. అందులో తప్పు ఎవరిదో మీరైనా కనిపెడతారా?  

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 7, 2022, 11:02 AM IST
    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫన్నీ యాక్సిడెంట్
    • ఇందులో తప్పు ఎవరిదో కనిపెట్టండి అంటూ వైరల్
Funny Accident Video: ఈ ఫన్నీ యాక్సిడెంట్ లో తప్పు ఎవరిదో మీరే కనిపెట్టండి?

Funny Accident Video: సోషల్ మీడియాలో తరచుగా కొన్ని వీడియోలు వైరల్ గా మారుతుంటాయి. సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే వీడియోలతో పాటు షాకింగ్ వీడియోలు, ఫన్నీ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా షేర్ అవుతుంటాయి. అలాంటి ఓ ఫన్నీ యాక్సిడెంట్ వీడియో ఇప్పుడు గూగుల్ లో ట్రెండ్ అవుతుంది. అయితే ఆ యాక్సిడెంట్ ను మొదట చూడగానే నవ్వొస్తుంది. ఆ తర్వాత అందులో తప్పు ఎవరిదనే దానిపై ఎవరూ కనుగొనలేకపోతున్నారు. ఈ ఫన్నీ యాక్సిడెంట్ లో తప్పు ఎవరిదో మీరు కనిపెట్టండి. 

వీడియోలో ఏముంది?

ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణమైపోయాయి. రోడ్డుపై ప్రమాదాలు జరగడం మనలో చాలామంది కళ్లారా చూసే ఉంటారు. ఈరోజు మనం చూపించబోయే వీడియో చాలా ఫన్నీగా ఉంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో ప్రకారం.. ఓ యువకుడు రోడ్డు దాటేందుకు ప్రయత్నించడం వీడియోలో కనిపిస్తోంది. ఇంతలో మరోవైపు ఓ యువకుడు సైకిల్‌పై వేగంగా వస్తున్నాడు.

రోడ్డు దాటుతున్న వ్యక్తి సైకిల్ ను గమనించలేదు. అప్పటివరకు అక్కడే నిల్చొని ఉన్న ఆ వ్యక్తి.. సైకిల్ వస్తున్న విషయాన్ని గమనించకుండా పరుగెత్తాడు. అలా పరిగెత్తుతున్న వ్యక్తిని సైకిల్ పై వస్తున్న యువకుడు ఢీ కొట్టాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ వీడియో పలువురు నెటిజన్లకు నవ్వు తెప్పిస్తోంది. దీనిపై నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. 

ఐపీఎస్ అధికారి షేర్ చేసిన వీడియో

ఈ ఫన్నీ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా తన అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి షేర్ చేశారు. దీంతో 'ఎవరి తప్పు' అనే క్యాప్షన్‌ తో వీడియోను పోస్ట్ చేశారు. 5 సెకన్ల నిడివి గల ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వేగంగా కనిపిస్తోంది. వీడియో చూసిన నెటిజన్లు తమాషాగా కామెంట్స్ చేస్తున్నారు.  

Also Read: Video: అచ్చు అల్లు అర్జున్‌ని దింపేసిందిగా.. ఆమె డ్యాన్స్‌కి నెటిజన్లు ఫిదా...

Also Read: Wife Listed Her Husband for Sale: అచ్చు ఐపీఎల్ మాదిరే.. భర్తను వేలం సైట్‌లో అమ్మకానికి పెట్టిన భార్య! నో రిటర్న్, నో ఎక్స్చేంజ్‌!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News