Garbage Throwing Viral Video: కొన్ని ప్రత్యేక వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారతాయి. అది వారి ప్రవర్తనతీరుపై ఆధారపడి ఉంటుండి. ఇలాంటి అనేక వీడియోలు సోషల్‌ మీడియా వేదికగా ఎన్నో చూస్తుంటాం. ఏ దేశమో తెలియదు కానీ, ఓ అమ్మాయి కారులో నుంచి చెత్తను రోడ్డుపై ఉన్న బుట్టలో వేయడానికి ప్రయత్నించింది. అది కుదరలేదు. కారు దిగి బుట్టలో వేయకుండా దాన్ని కారువైపు లాగి మళ్లీ కారు ఎక్కి విండో నుంచి చెత్తను వేయడానికి ప్రయత్నించింది. అయినా ఏం లాభం? చెత్త మాత్రం బుట్టలో పడలేదు. పక్కన పడిపోయింది. ఈమె అతి తెలివిని చూసి సోషల్‌ మీడియాలో రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫన్ని వీడియో సోషల్‌ మీడియా వేదికగా నవ్వులు పూవులు పూయిస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ వీడియోలో కేవలం పక్కనే ఉన్న బుట్టలో చెత్త వేయడానికి ఆమె ఎందుకు అంత కష్టపడుతుంది? అని ఒకింత ఆశ్చర్యపోతున్నారు. ఈమె బుర్రకు దండం పెడుతున్నారు. నిజంగా ఆమె బుర్ర వాడింది అని ఈ వీడియో చూసిన మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.


ప్రస్తుతం ఈ వైరల్‌ వీడియో మైక్రోబ్లాగింగ్‌ ప్లాట్‌ఫారమ్‌ ఎక్స్‌ వేదికగా @vishvguru0     అకౌంట్‌ ద్వారా షేర్‌ అయింది. ఈ వీడియోలో మొదట ఆ అమ్మాయి కారు లోపలి నుంచి చెత్త డస్ట్‌ బిన్‌లో వేయడానికి ప్రయత్నించింది. ఆమె చేతిలో ఉన్న చెత్తను పడేద్దామని ప్రయత్నించింది. కారు, డస్ట్‌బిన్‌ కాస్త దూరంగా ఉండటంతో  కారులో నుంచి బయటకు దిగక తప్పలేదు. దిగిన ఆమె చెత్తబుట్టలో సులభంగా వేయకుండా కారు వద్దకు చెత్తబుట్టను లాగింది. నానాతంటాలు పడి కారు డోరు ఓపెన్‌ చేసింది. చివరకు కారులో కూర్చొని చెత్తను ఎట్టకేలకు బుట్టలో వేసింది కానీ, బుట్టలో పడలేదు పక్కనే రోడ్డుపై పడింది. ఇక చేసేదేం లేక సైలంట్‌గా వెళ్లిపోయింది.


 



 


 



 


ఇదీ చదవండి: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..


 


కొంతమంది యూజర్లు అయితే, వావ్‌, వెర్రీ గుడ్‌ అని కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు ఇంత కష్టపడినా డబ్బాలో వెళ్లి పడకపోవడం చెత్త తప్పు అని, మరికొందరు అందుకే అంటారు మెదడు మోకళ్లలో ఉంటుందని రకరకాలుగా కామెంట్లు సోషల్‌ మీడియా వేదికగా పెడుతున్నారు.


 


ఇదీ చదవండి: మహేష్ బాబు విగ్గు రహస్యం.. నిగ్గు తేల్చే నిజాలు ఇవే..  


 




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.