Truth Behind Mahesh Babu Wig: మహేష్ బాబు విగ్గు రహస్యం.. నిగ్గు తేల్చే నిజాలు ఇవే..

Truth Behind Mahesh Babu Wig: ఇప్పటికీ మహేష్ బాబుకు సంబంధించి ఓ విషయం అభిమానులను తొలిచేస్తూ ఉంటుంది. అదేమిటంటే.. మహేష్ బాబుది ఒరిజినల్ జుట్టా.. లేకపోతే విగ్గా అనే అనుమానం చాలా మందిలో ఉంది. ఇంతకీ మహేష్ బాబు విగ్గు వెనక ఉన్న రహస్యం ఏమిటో చూద్దాం..

1 /7

కెరీర్ ప్రారంభంలో మహేష్ బాబు కొన్ని సినిమాల్లో తన ఒరిజినల్ జుట్టుతోనే యాక్ట్ చేసాడు. ఆ తర్వాత క్రమంగా జుట్టు ఊడిపోతూ ఉండటం ప్రారంభమైంది. అప్పటి నుంచి విగ్గు పెడుతున్నట్టు వార్తలు వచ్చాయి.

2 /7

ఇక మహేష్ బాబు అత్యున్నత సాంకేతికతతో కూడిన హెయిన్ ట్రాన్స్ ప్లాంటేషన్ కూడిన క్యూ 6 హెయిర్ ప్యాచ్ టెక్నాలజీ చేయించుకున్నట్టు వార్తలు వచ్చాయి.  

3 /7

కానీ అదంత హంబక్ అని చాలా మంది హెయిర్ స్టైలిస్ట్ లతో పాటు జుట్టు పెరుగుదలపై పరిశోధనలు చేసే డాక్టర్లు చెబుతున్నారు. తాజాగా మహేష్ బాబు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వరద బాధితుల సహాయర్దం రూ. 50 లక్షల చెక్ అందజేసాడు. ఈ ఫోటోలో మహేష్ బాబు పెరిగిన పెరిగిన గడ్డం, జుట్టుతో కనిపించి అభిమానులను అలరించారు.

4 /7

ఒక ఎంత గొప్ప హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేసుకున్న ఈ రేంజ్ లో జుట్టు పెరగదు అని చెబుతున్నారు జుట్టుకు సంబంధించిన నిపుణులు.అయితే అప్పట్లో మహేష్ బాబు కేరళకు చెందిన కొన్ని హెర్బల్ హెయిర్ ఆయిల్స్ తో తన జుట్టును ఒత్తుగా పెరిగేలా చేసుకున్నాడనే ఓ టాక్ కూడా నడిచింది.

5 /7

ఒకవేళ హెయిర్ సర్జికల్ ఫిక్సింగ్ సిస్టం సెటప్ అయితే మాత్రం దానిపై కొత్తగా జుట్లు మొలవదు. ఈ మధ్య కాలంలో కొంత మంది తెలంగాణ, ఏపీకి చెందిన రాజకీయ నాయకులే కాకుండా  బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ తో పాటు అనేక హీరోలు చేయించుకున్నారని సమాచారం.తాజాగా మహేష్ బాబును చూస్తే అలా హెయిర్ సర్జికల్ ఫిక్సింగ్ సిస్టం చేయించుకోలేదనే విషయం స్పష్టమవుతోంది.

6 /7

ఏది ఏమైనా మహేష్ బాబు అంటే గిట్టని వాళ్లు ఆయన బట్టతలను  విగ్గుతో కవర్ చేసుకునేవాడని ఇప్పటికీ చెప్పుకుంటున్నారు.   తాజాగా మహేష్ బాబు పెరిగిన ఒత్తైన జుట్టుతో కనిపించి తనను విమర్శించే వాళ్లు నోళ్లు మూయించాడని ఆయన  అభిమానులు సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు.

7 /7

ఏది ఏమైనా మహేష్ బాబు .. తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో మరోసారి మహేష్ బాబుది విగ్గా.. ? ఒరిజినల్ జుట్టా అనే అనే ఇష్యూ మరోసారి వార్తల్లో నిలిచింది.