Surya Grahanam: అక్టోబర్‌ 2న మహాలయ అమావాస్య, సూర్యగ్రహణం.. ఈ 4 రాశులకు కుభేరయోగం..!

Surya Grahanam 2024: సూర్యగ్రహణం కన్యారాశిలో చోటుచేసుకుంటుంది. ఈ రాశివారికి కీడు సమయం. ఈ 15 రోజులపాటు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాలు చేసేటప్పుడు అలెర్ట్‌గా ఉండాలి. ఇలా సూర్యగ్రహణం వల్ల ప్రభావం చెందే నాలుగు రాశులు ఏవో తెలుసుకుందాం
 

1 /9

అక్టోబర్‌ 2 వ తేదీ సూర్యగ్రహణం రానుంది. ఈరోజు మహాలయ అమావాస్య కూడా కన్యారాశిలో గ్రహణం ఏర్పడనుంది. తమ రాశి నుంచి ఆ గ్రహణ రాశికి 12, 8, 4, 1 స్థానాల్లో ఉంటే ఆ రాశులకు చెడు కాలం అని అర్థం.  

2 /9

కన్యరాశి.. 1 వ రాశిలో ఏర్పడనుంది. వీరికి జన్మస్థానంలో జరుగుతుంది. కాబట్టి అనారోగ్యం, కీర్తి ప్రతిష్ఠలు పోగొట్టుకుంటారు. గాయాలు అయ్యే ప్రమాదం ఉంది. ఈ  సమయంలో వీరు అత్యంత జాగ్రత్త వహించాలి. ఎంతో సంయమనం పాటించాలి. కన్యరాశివారు ఆచితూచి మాట్లాడాలి.

3 /9

తుల రాశి.. 12 వ రాశిలో గ్రహణం కాబట్టి ఆస్తులు పోగొట్టుకుంటారు. సూర్యగ్రహణం సమయంలో వీరు మోసపోతారు. ఓ పదిహేను రోజులపాటు ఖర్చులు, పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి.

4 /9

కుంభరాశి.. 8వ రాశివారికి శత్రు భయం ఉంది. రుణ బాధలు ఎక్కువయ్యే ఛాన్స్‌ ఉంటుంది. గ్రహణం తర్వాత 15 రోజులపాటు కుంభరాశివారు జాగ్రత్తలు పాటించాలి. సూర్యగ్రహణం ప్రభావం వల్ల కొత్త పనులు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

5 /9

మిథున రాశి.. 4వ స్థానంలో గ్రహణం, తల్లిగారికి అనారోగ్యం, కుటుంబంలో కలహాలు, వాహన గండం, శాంతి కోల్పోతారు.. అందుకే మిథున రాశివారు కూడా సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

6 /9

వృశ్చిక రాశి.. 11 వస్థానం సూర్యగ్రహణ, పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. సూర్యగ్రహణం వీరికి అత్యంత బాగా కలిసి వచ్చే కాలం. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. వృశ్చిక రాశివారికి ఇది అత్యంత అనుకూలమైన సమయం

7 /9

ధనస్సు రాశి.. దశమ స్థానంలో సూర్యగ్రహణం జరుగుతుంది. కాబట్టి ధనస్సు రాశివారికి కూడా ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. విదేశాలకు వెళ్లే వారికి ఇది అత్యంత శుభదాయకం. కొత్త పనులు ప్రారంభిస్తారు.

8 /9

మేషరాశి.. మేషరాశి వారికి 6వస్థానంలో సూర్యగ్రహణం చోటు చేసుకుంటుంది. కాబట్టి శత్రువులపై విజయం సాధిస్తారు. ముఖ్యంగా సుర్యగ్రహణ వల్ల మేషరాశివారికి మేలు జరుగుతుంది.

9 /9

కర్కాటక రాశి.. మూడవ స్థానంలో సూర్యగ్రహణం చోటు చేసుకుంటుంది. దైర్యసాహసాలు, కలహాలు తొలగిపోతాయి మేలు జరిగే రాశి. ఉద్యోగంలో పేరుప్రఖ్యాతలు పొందుతారు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)