Video: వావ్.. ఈ బుడ్డోడు చేసిన పనికి నెటిజన్లు ఫిదా... మీరూ ఓ లుక్కేయండి..
Viral Video of a Kid and Sheep: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వైరల్ వీడియోలు దర్శనమిస్తుంటాయి. అందులో నవ్వు తెప్పించేవి, మనసుకు హాయిగా అనిపించేవి.. ఇలా రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ బుడ్డోడి వీడియో నెటిజన్ల మనసు దోచుకుంటోంది.
Viral Video of a Kid and Sheep: పిల్లల ప్రపంచం చాలా అందంగా ఉంటుంది. వాళ్లతో పాటు ఆ లోకంలో విహరించగలిగితే మనసుకు బోలెడంత సంతోషం. అలాంటి సంతోషాన్ని పంచే పిల్లల వీడియోలకు సోషల్ మీడియాలో కొదువ లేదు. తాజాగా సోషల్ మీడియాలో ఓ చిన్నారి వీడియో వైరల్ అవుతోంది. తప్పిపోయిన గొర్రె పిల్లను దాని తల్లి వద్దకు చేర్చాడు ఆ బుడ్డోడు. తన బుడి బుడి నడకలతో గొర్రె పిల్లకు దారి చూపిస్తూ ముందుకు తీసుకెళ్లాడు. కాస్త ముందుకెళ్లగానే ఎదురుగా తల్లి గొర్రె కనిపించింది. అంతే.. ఆ గొర్రె పిల్ల చెంగు చెంగున ఎగురుతూ తల్లిని చేరింది. తప్పిపోయిన గొర్రె పిల్లను తల్లి వద్దకు చేర్చిన ఆ బుడ్డోడిని చూసి నెటిజన్లు మురిసిపోతున్నారు.
'గుడ్ న్యూస్.. మూవ్‌మెంట్' అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియో పోస్ట్ అయింది. 'ఈ చిన్నారి ఆ గొర్రె పిల్లను తన తల్లి వద్దకు చేర్చేందుకు సాయం చేసిన తీరు ఎంత స్వీట్‌గా ఉంది.' అంటూ వీడియోకి కామెంట్‌ను జతచేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ బుడ్డోడు 'సూపర్ మారియో'లా ఉన్నాడని కామెంట్స్ చేస్తున్నారు. వీడియో చాలా క్యూట్‌గా ఉందని అంటున్నారు. ఆ తల్లి గొర్రె పరిగెత్తుకొస్తుంటే.. ఎక్కడ ఆ బుడ్డోడిపై దాడి చేస్తుందేమోనని భయపడ్డానని.. కానీ అలా ఏం జరగలేదని ఓ నెటిజన్ కామెంట్ చేయడం గమనార్హం. 3 రోజుల క్రితం పోస్ట్ అయిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకి ఇప్పటివరకూ 1,91,659 వ్యూస్ వచ్చాయి.
Also Read: Kishan Reddy on CM Kcr: కుటుంబం కోసమే జాతీయ పార్టీ..సీఎం కేసీఆర్‌పై కిషన్‌రెడ్డి విమర్శలు..!
Also Read: Ante Sundaraniki: 'అంటే.. సుందరానికీ' నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్‌పై మాదాపూర్ పీఎస్‌లో కేసు నమోదు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి