Ante Sundaraniki: 'అంటే.. సుందరానికీ' నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్‌పై మాదాపూర్‌ పీఎస్‌లో కేసు నమోదు..

Nani Ante Sundaraniki:  అనుమతి లేకుండా భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించినందుకు అంటే సుందరానికి మేకర్స్, శ్రేయాస్ మీడియాపై పోలీసులు కేసు నమోదు చేశారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 11, 2022, 02:50 PM IST
  • అంటే సుందరానికీ నిర్మాణ సంస్థపై కేసు
  • సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు అనుమతి లేకపోవడంతో కేసు నమోదు చేసిన పోలీసులు
  • మైత్రీ మూవీస్, శ్రేయాస్ మీడియాపై నమోదైన కేసు
Ante Sundaraniki: 'అంటే.. సుందరానికీ' నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్‌పై మాదాపూర్‌ పీఎస్‌లో కేసు నమోదు..

Nani Ante Sundaraniki: 'అంటే.. సుందరానికీ' సినిమా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, ఈవెంట్ ఆర్గనైజేషన్ శ్రేయాస్ మీడియాపై హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మాదాపూర్ శిల్పా కళావేదికగా ఈ నెల 9న జరిగిన 'అంటే సుందరానికీ' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ఎలాంటి అనుమతి తీసుకోకపోవడంతో కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్‌కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా రావడంతో.. భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇంత పెద్ద ఈవెంట్ నిర్వహించారనే కారణంతో పోలీసులు సుమోటో కేసు నమోదు చేసినట్లు సమాచారం. 

నేచురల్ స్టార్ నాని, మలయాళ బ్యూటీ నజ్రియా జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన 'అంటే సుందరానికీ' శుక్రవారం (జూన్ 10) ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. నాని నటన, డైలాగ్స్.. నజ్రియా పెర్ఫామెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ..  సినిమా నిడివి, సినిమాలో ట్విస్టులు ఎక్కువయయ్యానే కంప్లైంట్స్ వినిపిస్తున్నాయి.

కలెక్షన్ల విషయానికొస్తే.. నైజాంలో తొలి రోజు ఈ సినిమా రూ.1.56 కోట్లు వరకు గ్రాస్ వసూలు చేసింది. అమెరికాలో రూ.3.4 కోట్లు వరకు వసూలు చేసింది. ఆంధ్రా, నైజాం ప్రాంతాల్లో రూ.3.87 కోట్లు షేర్ రాబట్టింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ.6.50 కోట్లు వరకు గ్రాస్, రూ.4 కోట్లు వరకు షేర్  రాబట్టింది. విక్రమ్ సినిమా జోరు 'అంటే సుందరానికీ' కలెక్షన్లపై పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

Also Read: Ktr Comments: కుల, మత పిచ్చొళ్లను తరిమేద్దాం.. రేవంత్, సంజయ్ పై కేటీఆర్ ఫైర్  

 

 

Also Read: Monsoon Entering Telugu States: రాగల 48 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు... 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News