Kishan Reddy on CM Kcr: దేశ రాజకీయాలపై ఫోకస్ సీఎం కేసీఆర్..ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన నేతృత్వంలో భారత్ రాష్ట్రీయ సంఘ్ ఏర్పాటు కానుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈక్రమంలోనే సీఎం కేసీఆర్‌పై విపక్షాలన్నీ ఫైర్ అవుతున్నాయి. రాష్ట్రంలోనే సరిగా పాలన చేయలేని వ్యక్తి..దేశ రాజకీయాల్లోకి వెళ్లి ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నాయి.
తాజాగా టీఆర్ఎస్ జాతీయ పార్టీపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టొచ్చని..కానీ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలన్నారు. సీఎం కేసీఆర్ కుటుంబంలో రాజకీయ నాయకులు ఎక్కువయ్యారని..అందుకే జాతీయ పార్టీ పెట్టాలని ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోందని చెప్పారు. కేసీఆర్ కుటుంబానికి రాష్ట్రం సరిపోక..దేశాన్ని పంచుకోవాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై వ్యతిరేకత పెరుగుతోందన్నారు. అందుకే జాతీయ పార్టీ ఆలోచన చేస్తున్నారని విమర్శించారు. ప్రజల దృష్టికి మరల్చడానికి జాతీయ పార్టీని తెరపైకి తీసుకొస్తున్నారని మండిపడ్డారు. కుటుంబ పాలనను ఆదరించాలా..దేశం కోసం పని చేసే పార్టీలను ఆదరించాలా అన్న విషయాన్ని ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. టీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమి లేదన్నారు కిషన్‌రెడ్డి.
Also read: Southwest Monsoon: దేశంలో విస్తరిస్తున్న నైరుతి రుతు పవనాలు..త్వరలో భారీ వర్షాలు..!
Also read: Ys Sharmila on Kcr: వైఎస్‌ఆర్ విగ్రహంపై చేయి వేశారా ఖబడ్దార్..టీఆర్ఎస్‌పై షర్మిల హాట్ కామెంట్స్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Kishan Reddy on CM Kcr: కుటుంబం కోసమే జాతీయ పార్టీ..సీఎం కేసీఆర్‌పై కిషన్‌రెడ్డి విమర్శలు..!
దేశంలో మరో రాజకీయ పార్టీ రాబోతోందని ప్రచారం
జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ ఫోకస్
టీఆర్ఎస్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విసుర్లు