Chimpanzee Drinking Coconut Water: చింపాంజీలకు, మనుషులకు మధ్య చాలా విషయాల్లో దగ్గరి పోలికలు ఉంటాయంటుంటారు. ఎన్నో విషయాల్లో అవి అచ్చం మనుషుల్లాగే ప్రవర్తిస్తుంటాయి. అయినా ఆ మాటకొస్తే.. నాగరికత నేర్చుకోకముందు ఆదిమానవుడి నడక, నడవడిక కూడా కోతులు, చింపాంజీలలాగే ఉంటాయనే వాదన కూడా ఉంది కదా. వాటన్నింటిని నిజం చేస్తున్నట్టుగా ఈ చింపాంజీ ఏం చేస్తుందో చూడండి. స్టైల్‌గా సన్‌గ్లాసెస్ పెట్టుకుని, కోకోనర్ వాటర్ తాగుతూ కూల్‌గా రిలాక్స్ అవుతోంది. ఈ చింపాంజీ స్టైల్‌ని చూసి కొన్నిసార్లు తమకు కూడా ఇంత సుఖం దక్కడం లేదే అని నెటిజెన్స్ కూడా కుళ్లుకుంటున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కూల్‌గా సన్‌గ్లాసెస్ పెట్టుకుని కొబ్బరికాయలో స్ట్రా వేసుకుని కొబ్బరి నీళ్లు తాగుతున్న ఈ చింపాంజీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చింపాంజీ పేరు లింబాని. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం మియామిలోని జువాలాజికల్ వైల్డ్ లైఫ్ ఫౌండేషన్ (ZWF) జూ ఈ చింపాంజీ నివాసం. జూలో ఉండే చింపాంజీనే కదా అని లైట్ తీసుకోకండి.. ఎందుకంటే ఈ చింపాంజీకి సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అవును.. ఇన్‌స్టాగ్రామ్‌లో లింబానికి 7 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. 



ఇప్పటివరకు లింబాని ఇన్‌స్టాగ్రామ్‌లో 1088 పోస్టులు పెట్టగా.. ఆ ఫోటోలు, వీడియోలు అన్నింటికి భారీ స్పందన కనిపించింది. అలాగే ఈ సన్‌గ్లాసెస్, కోకోనర్ వాటర్ వీడియోకు కూడా 8 లక్షల లైక్స్ వచ్చాయి. అవి ఇంకా పెరుగుతునే ఉన్నాయి. అందుకే లింబానికి సోషల్ మీడియాలో అంత ఫాలోయింగ్.


Also Read : Man Carries His Wife on Shoulders: భార్యను భుజాలపై ఎత్తుకుని తిరుమల కొండపైకి.. సత్తిబాబు మామూలోడు కాదు..


Also Read : Kissing Cobra Goes Wrong: నాగు పాముకు కిస్ ఇస్తుంటే సడెన్‌గా వెనక్కి తిరిగి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో


Also Read : Monkey Playing With Tiger: పులిని తెలివిగా ఫూల్ చేసి కిందపడేసిన కోతి.. వీడియో వైరల్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి