Viral Video Of Leopard: ఘాజియాబాద్ వీధుల్లో చిరుత హల్చల్
Leopard in Ghaziabad | అడవుల విస్తీర్ణం తగ్గుతుండటంతో మూగజీవాలు బస్తీబాట పట్టాయి. అడవుల్లో సంచరించడానికి వాటికి సరైనా చోటు లేకపోవడంతో వీధుల్లోకి వస్తున్నాయి. తాజాగా అలాంటి ఒక ఘటన ఉత్తర భారతదేశంలోని ఘాజియాబాద్ లో జరిగింది.
Leopard Video in CCTV Footage | అడవుల విస్తీర్ణం తగ్గుతుండటంతో మూగజీవాలు బస్తీబాట పట్టాయి. అడవుల్లో సంచరించడానికి వాటికి సరైనా చోటు లేకపోవడంతో వీధుల్లోకి వస్తున్నాయి. తాజాగా అలాంటి ఒక ఘటన ఉత్తర భారతదేశంలోని ఘాజియాబాద్ లో జరిగింది. స్థానిక కవీనగర్ లో మంగళవారం ఉదయం ఒక చిరుతను చూసినట్టు అధికారులు తెలిపారు. ఘాజియాబాద్ డెవెలెప్మెంట్ ఆథారిటీ చైర్ పర్సన్ ఇంట్లోని జెనరేటర్ రూమ్ లోకి ఈ చిరుత ప్రవేశించింది.
Also Read | Does Snake Drink Milk: పాములు పాలు తాగుతాయా? 5 అపోహలు, 5 వాస్తవాలు!
ఈ విషయం గురించి తెలియని అక్కడ పని చేసే వ్యక్తి జెనరేటర్ ను ఆన్ చేయడానికి అక్కడికి వెళ్లాడు. అది గమనించిన చిరుత ( Leopard ) వెంటనే అతనిపైకి దూకింది. అతని అరుపులు విన్న స్థానికులు, ఇతర వర్కర్స్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. చీపుర్లు, కర్రలతో చిరుతను బెదిరించగా..అది గోడపై నుంచి చెట్టుపైకి ఎక్కేసింది. తరువాత అది ఒక ఇనిస్టిట్యూట్ క్యాంపస్ లోకి ప్రవేశించింది.
Also Read | Fact Check: కరోనా టీకా వచ్చిసిందా ? వాట్సాప్ మెసేజ్ లో నిజమెంత?
సీసీటీవీ ఫుటేజీలో మొత్తం తంతు రికార్డు అయింది అని స్థానిక జిల్లా మెజిస్ట్రేట్ తెలిపాడు. చిరుతను బంధించడానికి ఐదు టీమ్లు ఏక్పాటు చేశామని తెలిపారు. వారు చాల కష్టపడి బంధించినట్టు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ( Social Media ) బాగా వైరల్ అవుతోంది.
ఆ వీడియోను మీరు కూడా చూడండి
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G IOS Link - https://apple.co/3loQYeR