Bhangra Dance at London Airport: చాన్నాళ్ల తర్వాత ఒక ఫ్రెండును చూస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో మన అందరికీ తెలిసిందే. విదేశాల్లో ఉండే ఒక వ్యక్తి చాలా రోజుల తర్వాత తన ఫ్రెండ్‌ని కలిస్తే ఆ ఫీలింగ్ ఇంకెంత సూపర్‌గా ఉంటుందనేది మాటల్లో చెప్పలేం. స్నేహ బంధంలో ఉండే మజా అలాంటిది. చాలా గ్యాప్ తర్వాత ఆత్మీయ మిత్రులను చూసినప్పుడు ఎవ్వరికైనా ఆనందం తన్నుకొస్తుంది. అదే సేమ్ సీన్ విదేశీ గడ్డపై జరిగితే ఆ ఆనందం విలువ వెలకట్టలేనిది కదా.. ఇదిగో ఇప్పుడు మనం చూడబోయే ఈ వీడియోలో ఉన్న ఇద్దరు మిత్రులది కూడా అలాంటి ఆనందమే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విదేశీ గడ్డపై భారతీయులను కలిసినప్పుడు కలిగే ఆనందమే వేరు. అందులోనూ అయినవారిని, బాగా తెలిసిన వారిని, మనం కోరుకునే వారిని కలిసినప్పుడు కలిగే ఆనందాన్ని నిర్వచించడం కష్టమే కదా!! ఆ ఫీలింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే కానీ ఆలస్యం చేయకుండా ఇదిగో ఈ వీడియో చూసేయండి.. అదేలా ఉంటుందో మీకే అర్థమవుతుంది.



ఈ వీడియోను ట్విటర్ ద్వారా నెటిజెన్స్‌తో షేర్ చేసుకున్న ఓ ట్విటర్ యూజర్.. లండన్‌లోని హీథ్రో ఎయిర్ పోర్టులో చూసిన వెల్‌కమ్ సీన్స్‌లోనే ఇదొక లెజెండరీ వెల్‌కమ్‌గా అభివర్ణించాడు. లండన్‌లో ఉంటున్న పంజాబీ వ్యక్తి కొత్తగా లండన్‌కి వచ్చిన తన స్నేహితుడిని చూసి ఎయిర్ పోర్టులోనే బల్లే బల్లే అంటూ స్టెప్పులేశాడు.  లండన్‌లోని హీత్రో ఎయిర్ పోర్టు ఈ భలే భలే దృశ్యానికి వేదికైంది.


బల్లే బల్లే స్టెప్పులు అంటే తెలిసిందే కదా.. పంజాబీ సంస్కృతిలో ఒక భాగమైన నృత్య రూపం భాంగ్రా డ్యాన్స్ చేస్తూ వేసే స్టెప్పులే ఈ బల్లే బల్లే డ్యాన్స్. భాంగ్రా డాన్స్ పంజాబీ నృత్య రూపమే అయినప్పటికీ.. పంజాబీ సెలబ్రిటీల పుణ్యమా అని అది ఎప్పుడో యావత్ ప్రపంచానికి పాకిపోయింది. 


భాంగ్రా డ్యాన్స్ పంజాబీల జీవితంలో, సంస్కృతిలో ఒక భాగమైపోయింది. పెళ్లిళ్లు, పేరంటాలు.. పండగలు.. ఉత్సవాలు.. ఇలా వేడుకలు ఏవైనా.. అక్కడ బల్లే బల్లే అంటూ భాంగ్రా డాన్స్ చేయకుండా పంజాబీలు ఉండలేరంటే అతిశయోక్తి లేదు.