viral video: reporter asks people why didn't you wear the mask, here is the hilarious responses: దేశం అంతా మళ్లీ కరోనా కోరల్లో చిక్కుకుంటోంది. ఇప్పటికే ఫస్ట్, సెకండ్ వేవ్‌లను చూసిన దేశం మరోసారి థర్డ్‌వేవ్‌కు (Third wave) రెడీ అయింది. దేశవ్యాప్తంగా రోజూ భారీ సంఖ్యలో కొవిడ్ కేసులు (Covid cases) నమోదవుతున్నాయి. అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా దేశం అంతా కరోనా (Corona) మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా పాజిటివ్ రేట్ (Corona positive rate) క్రమంగా పెరుగుతోంది. ఒమిక్రాన్‌ వేరియెంట్ ప్రభావం కూడా ఎక్కువే ఉంది. దీంతో సరైనా జాగ్రత్తలు తీసుకోకుంటే కొవిడ్‌ (Covid‌) బారినపడుతారు అంటూ వైద్య నిపుణులు, ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. సేఫ్టీ ప్రికాషన్స్ (Safety Precautions) కచ్చితంగా తీసుకోవాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. 


మాస్కు (Mask) కచ్చితంగా ధరించాలని వైద్య నిపుణులు, ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఇక బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు పెట్టుకోకుంటే 
జరిమానాలు విధిస్తామంటూ కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. అయితే కొందరు మాత్రం మాస్కును అసలు ఉపయోగించట్లేదు. 


ప్రస్తుత పరిస్థితుల్లో మాస్క్ ధరించడం, (Wear mask) సోషల్ డిస్టెన్స్ పాటించడం తప్పనిసరి. ఈ విషయాన్ని మరిచి ప్రవర్తిస్తున్నారు కొందరు జనాలు. ఇక మాస్క్ గురించి ఒక రిపోర్టర్ అడిగే ప్రశ్నలకు.. వీళ్లు ఇచ్చే సమాధానాలు ఎలా ఉన్నాయో చూడండి..


ఆ రిపోర్టర్ (Reporter) మొదట ఓ వ్యక్తి వద్దకు వెళ్లి మాస్క్ ఎందుకు ధరించలేదు అని అడగ్గా.. నాకు మాస్కు అంతగా నచ్చదు అని చెప్పేశాడు ఆ పెద్దాయన. ఇక మరో వ్యక్తి... ఆ రిపోర్టర్‌‌ని వెళ్లు వెళ్లమ్మా అంటాడు. ఒక రిక్షావాలా తనకు తినడానికి తిండే లేదు.. ఇక మాస్కు ఎలా ధరిస్తా అని అంటాడు. మరొక వ్యక్తి ఏమో మాస్కును జేబులో పెట్టుకుని మరిచిపోయానని సమాధానం ఇస్తాడు.


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by GiDDa CoMpAnY (@giedde)


 


Also Read : Monkey Drinking Coke: కూల్ డ్రింక్ ఇలా తాగాలిరా బచ్చా.. చూసి నేర్చుకో!
ఇక ఫైనల్‌గా ఒక వ్యక్తిని మాస్క్ (Mask) ఎందుకు ధరించలేదు అని అడగడానికి రిపోర్టర్‌‌ ప్రయత్నించగా.. ఆయన ఆ మైక్‌ను చూసి బెదిరిపోతాడు.. దూరంగా వెళ్లిపోతాడు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) గిడ్డే అనే పేజీలో షేర్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో (Social media) ఫుల్ వైర​ల్ (Viral) అవుతోంది.


Also Read : Amazon vs Flipkart: అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సేల్ లో స్మార్ట్ ఫోన్లపై క్రేజీ ఆఫర్లు.. త్వరపడండి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook