విమాన ప్రయాణం ( Flight Journey ) ఎంత ఆహ్లదకరంగా కనిపిస్తుందో.. అంత రిస్కీ కూడా ఎందుకంటే ఎన్నో అంశాలు సానుకూలంగా ఉంటేనే ప్రయాణం సేఫ్ గా ముగుస్తుంది. విమానం సేఫ్ గా ల్యాండ్ ( Safe Land ) అవుతుంది. లేదంటే గాలికి కూడా విమానం పెను ప్రమాదానికి గురి కావచ్చు. క్షణాల్లో హ్యాప్పీ ఎండింగ్ కాస్త విషాదంగా మారవచ్చు. ఇప్పుడు మీరు చూడబోయే వైరల్ వీడియో ( Viral Video ) కూడా అలాంటిదే. కొన్ని విమానాలు రన్ వేపై ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్న సమయంలో క్రాస్ విండ్ ( Cross Wind ) ఎలా వాటిని ముప్పు తిప్పలు పెటిందో మీరు చూడవచ్చు. ఎదురుగాలి ఎలా ఒక పెద్ద విమానాన్ని కూడా తిప్పి పడేసిందో మీరు చూడవచ్చు.



ఈ  ట్రెండింగ్ వీడియోలో ( Trending Video ) పలు విమానాలు ల్యాండ్ అవ్వడానికి రన్ వే వైపు వస్తుండగా గాలి వాటిని దిగనివ్వడం లేదు. ఒక విమానం ఇలా ల్యాండ్ అయి మళ్లీ గాల్లోకి లేచి మళ్లీ ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది. మరో విమానం కంట్రోల్ కోల్పోతుంది. ఇంకో విమానం అయితే తిన్నగా నేలపై డ్యాష్ ఇచ్చేస్తుంది. చూడటానికే మనకు ఇంత షాకింగ్ గా అనిపిస్తే.. మరి అందులో ఉన్న ప్రయణికులకు ఎలా అనిపించి ఉండవచ్చు.. ఎదుగాలితో పోరాడుతున్న విమానాన్ని నడిపై పైలట్ పరిస్థితి ఎలా ఉండవచ్చో మనం ఊహించవచ్చు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ( Social Media ) తెగ వైరల్ అవుతోంది.