Prabhas 22: కేజీఎఫ్ దర్శకుడితో ప్రభాస్ ?

ప్రభాస్  కు ( Prabhas ) మంచిఇప్పుడు దేశ వ్యాప్తంగా మంచి పాపులారిటీ ఉంది. బాలీవుడ్ ( Bollywood ) దిగ్గజాల కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ కూడా తీసుకుంటున్నట్టు సమాచారం. ప్రభాస్ పాపులారిటీని బట్టి అన్ని ప్యాన్ ఇండియా సినిమాలకే ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

Last Updated : Aug 13, 2020, 12:40 PM IST
Prabhas 22: కేజీఎఫ్ దర్శకుడితో ప్రభాస్ ?

ప్రభాస్  కు ( Prabhas ) మంచిఇప్పుడు దేశ వ్యాప్తంగా మంచి పాపులారిటీ ఉంది. బాలీవుడ్ ( Bollywood ) దిగ్గజాల కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ కూడా తీసుకుంటున్నట్టు సమాచారం. ప్రభాస్ పాపులారిటీని బట్టి అన్ని ప్యాన్ ఇండియా సినిమాలకే ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ప్రస్తుతం రాధే శ్యామ్ ( Radhe Shyam ) సినిమా చేస్తున్న ప్రభాస్ ఆ తరువాత చేసే సినిమాల విషయంలో కూడా స్పీడు పెంచాడు. నాగ్ అశ్విన్ ( Nag Ashwin ) తో ఒక సినిమాకు ఫిక్స్ అయ్యాడు. దాంతో పాటు టీ సిరిస్ తో కూడా ప్యాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. అయితే కొత్తగా వినిపించిన టాక్ ఏంటంటే.. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కూడా ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాడట డార్లింగ్ ప్రభాస్.

 

కేజీఎఫ్ చాప్టర్ 1 ( KGF Chapter 1 ) తో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు సాధించిన ప్రశాంత్ నీల్ ( Prashant Neel ) తో పని చేయడానికి ప్రముఖ తారలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ( Jr NTR ) కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ అయింది అని సమాచారం. దాంతో పాటు ప్రభాస్ కూడా ప్రశాంత్ నీల్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడట. ప్రస్తుతం చేతిలో ఉన్న రాధేశ్యామ్, తరువాత నాగ్ అశ్విన్ తో సినిమా కంప్లీట్ అయ్యాక... ఈ మూవీ ఉంటుంది అని టాక్ వినిపిస్తోంది.

 

Trending News