Woman Thrashed by car video goes viral: ఇటీవల కాలంలో యువత పైత్యం పీక్స్ కు చేరిందని చెప్పుకొవచ్చు.  మొబైల్ ఫోన్ ను ఒక్క నిముషం కూడా వదలడం లేదు. పొద్దున కళ్లు తెరిచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్ లలో  ఉంటున్నారు. చివరకు బాత్రూమ్ కు వెళ్లిన కూడా మొబైల్ ను తీసుకెళ్తున్నారు. మొబైల్ లో మునిగిపోయి.. కుటుంబ సభ్యులతో కనీసం  మాట్లాడటం లేదు.  అంతే కాకుండా.. ఫోన్ లలో అన్ని రకాలు పనులు చేసేస్తున్నారు. దీంతో మనిషి ఒకరకమైన రోబోలాగా కూడా ప్రవర్తిస్తున్నాడని అంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒక్క నిముషం ఫోన్ కన్పించకుంటే... అదేదో జీవితంలో కోల్పోయిన విధంగా మారిపోతున్నారు. ఇక ఫోన్ లలో చార్జీంగ్ అయిపోతే.. గాబారా పడిపోతుంటారు. రాత్రి, పగలు తేడా లేకుండా ఫోన్ లలో  ఉంటు.. అనేక అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు. కొంత మంది రోడ్ల మీద ఫోన్ లలో చూసుకుంటూ రోడ్లు దాటు తుంటారు.



 


ఇలాంటి తరుణంలో అనుకొని సమస్యలు చోటు చేసుకుంటాయి. ఇప్పటికే ఫోన్ లలో చూసుకుంటూ డ్రైవింగ్ చేయడం వల్ల అనేక మంది తమ ప్రాణాలు కోల్పోయిన  ఘటనలు వార్తలలో నిలిచాయి. తాజాగా, మరో షాకింగ్ ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.


పూర్తి వివరాలు..


సింగపూర్ లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక యువతి తన ఫోన్ ను చూసుకుంటూ రోడ్డు దాటేందుకు ప్రయత్నించింది. ఇంతలో మరోవైపు నుంచి ఒక కారు స్పీడ్ గా వచ్చింది. ఆమె కారును గమనించకుండానే.. రోడ్డు మధ్యలో వరకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో కారు ఒక్కసారిగా ఆమెను బలంగా ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా గాల్లో బంతిలాగా ఎగిరి కింద పడింది.దీంతో కారు నడిపిస్తున్న వ్యక్తి షాక్ కు గురయ్యాడు.


వెంటనే తెరుకుని.. యువతి దగ్గరకు వెళ్లాడు. అప్పటికి  ఆమె కొద్దిపాటి గాయాలతో మెల్లగా లేవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తొంది. అతగాడు.. యువతిని పక్కకు తీసుకెళ్లడానికి ప్రయత్నించినట్లు కన్పిస్తుంది. ఈ ప్రమాదం ఘటనన  అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది.


Read more: Viral Video: ఇయ్యే వద్దనేది.. కింగ్ కోబ్రాకు ముద్దులు పెట్టుకుంటూ డాన్సర్ హల్ చల్.. షాకింగ్ వీడియో వైరల్..


 


ఈ వీడియో ప్రస్తుంతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం.. యువతికి చివాట్లు పెడుతున్నట్లు తెలుస్తొంది. మరోవైపు.. యువతి ఫోన్ లలో చూసుకుంటూ రోడ్డు దాటడం అవసరమా.. అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.