Viral Video: ఏనుగు పాలు తాగుతున్న మూడేళ్ల చిన్నారి.. ఎంత ముద్దుగుందో...
Video of baby girl drinks Elephant Milk: అస్సాంకు చెందిన ఓ మూడేళ్ల చిన్నారి ఏనుగు పాలు తాగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో కనిపిస్తున్న ఆ చిన్నారి అల్లరి, ముద్దు ముద్దు మాటలను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.
Video of baby girl drinks Elephant Milk: ఆవు పాలు, మేక పాలు తాగడం సహజం. దగ్గు, దమ్ము నివారణకు కొంతమంది గాడిద పాలు కూడా తాగుతారు. అయితే ఏనుగు పాలు తాగడం గురించి మీరెప్పుడైనా విన్నారా.. అస్సాంకు చెందిన హర్షిత బోరా అనే మూడేళ్ల చిన్నారి ఏనుగు పాలు తాగుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి ఆ వీడియోలో ఏనుగు పొదుగును నోట్లో పెట్టుకునేందుకు చిన్నారి ప్రయత్నించడమే కనిపిస్తోంది. అయితే ఏనుగు పాలు తాగే అలవాటు వల్లే చిన్నారి అలా చేసినట్లుగా చెబుతున్నారు. అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఆ వీడియోలో.. ఏనుగు కిందకు చేరిన చిన్నారి తన నోటితో దాని పొదుగును అందుకునేందుకు ప్రయత్నించడం గమనించవచ్చు. తన ముద్దు ముద్దు మాటలతో ఆ ఏనుగును చిన్నారి 'బిను.. బిను..' అంటూ పిలవడం ముచ్చటగా అనిపిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
ఆ ఏనుగు కూడా చిన్నారి అల్లరిని ఒక తల్లిలా ఆస్వాదిస్తోందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. వీడియోలో (Viral Video) పాప చాలా క్యూట్‌గా ఉందని... ఏనుగు పాలు తాగితే ఫ్యూచర్‌లో ఆ పాప కూడా దాని లాగే బలిష్టంగా తయారవుతుందని కొంతమంది నెటిజన్లు కామెంట్ చేశారు. 'ఆ పాప, ఏనుగు మధ్య రిలేషన్ బాగుంది... ఏనుగులు మనుషుల పట్ల చాలా దయతో ఉంటాయి... ముఖ్యంగా చిన్నారుల పట్ల..' అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. అయితే.. పొరపాటున ఏనుగు చిన్నారిని తొక్కితే ఎలా.. అంటూ కొంతమంది కామెంట్ చేయడం గమనార్హం. యూట్యూబ్‌లో ఈ వీడియోను ఇప్పటివరకూ 5లక్షల పైచిలుకు మంది వీక్షించారు. దాదాపు 4వేల పైచిలుకు లైక్స్ వచ్చాయి.
Also Read: Dinesh Karthik: భారత జట్టులో ఆడాలనే కసి ఇంకా ఉంది.. ఇప్పుడప్పుడే రిటైర్మెంట్ ప్రకటించేదిలే: డీకే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook