Woman strips and uses dress as face mask: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ (Covid-19) కల్లోలం సృష్టిస్తోంది. డెల్టా, డెల్టాప్లస్, ఒమిక్రాన్ వంటి కరోనా కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చి...ఎంతో మంది ప్రజల ప్రాణాలను బలిగొంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అంటూ నిబంధనలు విధిస్తున్నాయి. మాస్కు లేకుండా బయటకు వస్తే.. భారీగా జరిమానాలు వేస్తున్నాయి. తాజాగా అర్జెంటీనాలో (Argentina) ఓ యువతి మాస్కు లేకుండా ఐస్​క్రీమ్ స్టోర్​కు వచ్చి హల్​చల్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ (Viral) గా మారింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏం జరిగిందంటే..
అర్జెంటీనాలో ఓ యువతి మాస్కు లేకుండా ఐస్​క్రీమ్ స్టోర్​కు వచ్చింది. మాస్కు (Face Mask) లేనిదే ఐస్​క్రీమ్ విక్రయించేది లేదని స్టోర్ సిబ్బంది చెప్పారు. దీంతో ఆ మహిళ కోపంతో ఊగిపోయింది. 'నా మాస్కు గురించి మీరు అడగొద్దు..నేను పెట్టుకుంటున్నా' అంటూ... తన బట్టలు విప్పేసి ముఖానికి మాస్కులా పెట్టుకుంది. ఇదంతా ఐస్​క్రీమ్ పార్లర్​లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో (Social Media) హాల్ చల్ చేస్తోంది. 




Also Read: Viral Video: సింహాన్ని మోసుకెళ్లిన మహిళ, వీడియో వైరల్​


ఆ యువతి చేసిన పనికి ఐస్​క్రీమ్ పార్లర్ (ice cream parlour) సిబ్బంది షాక్ అయ్యారు. ఇలా ప్రవర్తించినందుకు ఐస్​క్రీమ్ విక్రయించేది లేదని తేల్చి చెప్పారు. దీంతో కోపంతో ఊగిపోతూ స్టోర్ నుంచి బయటకు వెళ్లిపోయింది. ఆ యువతి పది మంది స్నేహితులతో కలిసి వచ్చిందని స్థానిక వార్తా సంస్థ వెల్లడించింది. అందులో మాస్కు ధరించిన ఓ వ్యక్తి వచ్చి.. ఐస్​క్రీమ్​లు కొనుక్కొని వెళ్లారని తెలిపింది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి