Breakup Anti Valentines WeeK: మనలో చాలా మంది యువత ప్రేమ పెళ్లిళ్లకే ఎక్కువగా మొగ్గుచూపిస్తున్నారు. యువతీ, యువకులు ప్రేమలో ఇద్దరు కలసి కొన్నిరోజుల పాటు ట్రావెల్ చేస్తారు. దీనిలో వారి ఆలోచనలు, ఇష్టాయిష్టాలు, కెరిర్ పట్ల ప్లానింగ్ లు ఇలా అన్ని ముందే మాట్లాడుకుంటారు. దీనితో ఫ్యూచర్ లో ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు రావని, అన్యోన్యంగా జీవితం సాగించోచ్చని చాలా మంది భావిస్తుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Hair Loss: ఆరోగ్యకరమైన జుట్టు కోసం ఈ విటమిన్ల్‌ చాలా అవసరం..


ఇదేక్రమంలో ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు వాలెంటైన్ వారాన్ని ఎంతో మంది యువత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రతిరోజుకు ఉన్న ప్రాముఖ్యత యువతకు తెలిసిందే. కానీ చాలా మంది యువత తొలుత ప్రేమించుకుంటారు. కానీ కొన్నాళ్ల జర్నీ తర్వాత ఇద్దరు కూడా బ్రేకప్ చెప్పేసుకుంటారు.


కొందరు యువత.. తమను ప్రేమించిన వారిని మోసం చేయడానికి కూడా వెనుకాడరు. ఇలాంటి వారు యాంటీ వాలెంటైన్ వీక్ ను జరుపుకుంటారంట. వాలెంటైన్ వీక్ లో మాదిరిగా రోజ్ డే, ప్రపోజ్ డే, హగ్ డే మాదిరిగా.. యాంటీ వాలెంటైన్ వీక్ ను కూడా  15 పదిహేను తేదీ నుంచి వారంపాటు జరుపుకుంటారు. ఈ వారానికి కూడా రోజుకో ప్రాముఖ్యత ఉంది. 


అవేంటో ఇప్పుడు చూద్దాం..


స్లాప్ డే 2024:


యాంటీ-వాలెంటైన్స్ వీక్ స్లాప్ డేతో ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 15న స్లాప్ డే జరుపుకుంటారు. ఈ రోజు ప్రేమిస్తున్నట్లు నటించిన, ఫీలీంగ్స్ తో ఆడుకున్న మాజీ లవర్స్  చెంప దెబ్బ కొట్టడం ద్వారా దీన్ని జరుపుకుంటారు. 



కిక్ డే:


స్లాప్ డే తర్వాత, జాబితాలో మరుసటి రోజు, ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 16న జరుపుకునే కిక్ డే. ఈ రోజు మీ మాజీ లవర్స్ జ్ఞాపకాలను, మీరు వారి కోసం కొన్న గిఫ్ట్ లను తీసి బండకేసి బాది వారి  జ్ఞాపకాలను వదిలించుకోవచ్చన్నమాట.


పెర్ఫ్యూమ్ డే:


కిక్ డే తర్వాత, యాంటీ వాలెంటైన్స్ వీక్‌లోని మూడవ రోజు పెర్ఫ్యూమ్ డే, ఇది ఫిబ్రవరి 17న వస్తుంది. ఈ రోజు కేవలం మీ లైఫ్, ఫ్యూచర్ ప్లాన్ ల పైన ఆలోచించాలి. మంచి సువాసన వచ్చే సుగంధ పరిమళాన్ని ఈ రోజు ధరించాలని దీని థీమ్ అన్నమాట..


ఫ్లర్ట్ డే:


వాలెంటైన్స్ వ్యతిరేక వారంలో నాల్గవ రోజు ఫిబ్రవరి 18న సరసాలాడుట దినం. ఈ రోజు సింగిల్స్ అందరూ తమ ప్రేమను అవతలి వారికి వ్యక్త పరచవచ్చన్నమాట. మీకు నచ్చిన వ్యక్తికి మీ భావాలను తెలియజేయండి.


కన్ఫెషన్ డే:


యాంటీ-వాలెంటైన్ వీక్‌లో ఐదవ రోజు. ఇది ఫిబ్రవరి 19 న వస్తుంది. మీరు ఇష్టపడే వారితో లేదా గతంలో మీరు బాధపెట్టిన వారితో మీరు చేసిన తప్పులను ఒప్పుకోవడానికి ఈ రోజు మిమ్మల్ని అనుమతిస్తుంది. మీ భావాలకు క్షమాపణ చెప్పడం మిమ్మల్ని మంచి వ్యక్తిగా చేస్తుంది.


మిస్సింగ్ డే:


మిస్సింగ్ డే అనేది యాంటీ-వాలెంటైన్స్ వారంలోని ఆరవ రోజు. ఇది ఫిబ్రవరి 20న వస్తుంది.  మాజీ లవర్స్ జీవితంలో నుంచి వెళ్లిపోతే ఎంత ఆనందంగా ఉన్నామో..  ఈరోజున  వ్యక్త పర్చవచ్చన్నమాట. 


బ్రేకప్ డే 2024:


ఫిబ్రవరి 21న యాంటీ-వాలెంటైన్ వీక్ యొక్క చివరి రోజు బ్రేకప్ డేగా పరిగణించబడుతుంది. ఈ రోజు మీరు చాలా కాలంగా బాధపడుతున్న మీకుసెట్ కానీ బంధాన్ని లేదా రిలేషన్ ను ముగించడానికి బెస్ట్ రోజన్న మాట.


Read More: Amitabh Jaya Bachchan Assets: బాలీవుడ్‌ మెగాస్టార్‌ ఆస్తుల్లోనూ నంబర్‌వన్‌? ఆస్తులు, కార్లు, ఇతర వివరాలు ఇవిగో..
 




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook