Amitabh Jaya Bachchan Assets: బాలీవుడ్‌ మెగాస్టార్‌ ఆస్తుల్లోనూ నంబర్‌వన్‌? ఆస్తులు, కార్లు, ఇతర వివరాలు ఇవిగో..

Jaya Bachchan Affidavit: భారత సినీ పరిశ్రమలో చక్కని జోడీ ఎవరంటే అమితాబ్‌ బచ్చన్‌-జయ బచ్చన్‌ జంట ముందుంటుంది. సినీ జీవితంలోనూ వ్యక్తిగత జీవితంలోనూ హిట్లతో దూసుకెళ్తున్న ఆ కుటుంబం ఆస్తుల వివరాలు ఆసక్తి రేపుతున్నాయి. దశాబ్దాలుగా బాలీవుడ్‌ను ఏలుతున్న వారి కుటుంబ ఆస్తులు కూడా అదే స్థాయిలో ఉన్నాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 15, 2024, 03:59 PM IST
Amitabh Jaya Bachchan Assets: బాలీవుడ్‌ మెగాస్టార్‌ ఆస్తుల్లోనూ నంబర్‌వన్‌? ఆస్తులు, కార్లు, ఇతర వివరాలు ఇవిగో..

Jaya Bachchan Nomination: సినిమా పరిశ్రమకు చెందిన నటీనటుల సినిమా విషయాల కన్నా వ్యక్తిగత విషయాలంటే అందరికీ ఎంతో ఆసక్తి. ఇక వారి ఆస్తులు, వారి కార్లు, వేసుకునే బట్టలు, ఇంట్లోని వస్తువులు ఇలా ఏ విషయాలైనా ఎంతో ఆసక్తి. తాజాగా బాలీవుడ్‌ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌ కుటుంబానికి సంబంధించిన కీలకమైన విషయం బయటకు వచ్చింది. హిందీ సినీ పరిశ్రమలో దశాబ్దాలుగా అగ్ర నటులుగా కొనసాగుతున్న అమితాబ్‌ కుటుంబం ఆస్తుల విషయమై చర్చ నడుస్తోంది. ఆయన భార్య జయా బచ్చన్‌ మరోసారి రాజ్యసభకు పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా సమర్పించిన నామినేషన్‌ పత్రాల్లో ఆమె వెల్లడించిన కుటుంబ వివరాలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా వారి ఆస్తుల వివరాలు ఆసక్తికకంగా ఉన్నాయి.

Also Read: Tillu Square Trailer: టిల్లు అనే వాడు కారణజన్ముడు.. ఈసారి గట్టిగానే దెబ్బ తగిలేటట్టున్నది?

అఫిడవిట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం అమితాబ్‌, జయా బచ్చన్‌ ఆస్తుల విలువ అక్షరాల రూ.1,578 కోట్లు ఉంది. వాటిలో ఉమ్మడి చరాస్తుల విలువ రూ.849 కోట్లు కాగా, స్థిరాస్తి విలువ రూ.729 కోట్లుగా జయా బచ్చన్‌ తన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను తన వ్యక్తిగత నికర విలువ రూ.1.63 కోట్లుగా జయా తెలిపారు. ఇక తన భర్త అమితాబ్‌ నికర విలువ రూ.273.74 కోట్లుగా వివరించారు. ఇక తన బ్యాంకులో రూ.10 కోట్లు ఉన్నాయని, భర్త ఖాతాల్లో రూ.120 కోట్లు ఉన్నాయని వివరించారు. 

Also Read: Valentines Day: ఆంటీకి చెప్పు వద్దని.. నేను నిన్నే చేసుకుంటానని బాయ్‌ఫ్రెండ్‌ ఫన్నీ రిప్లయ్‌

ఆభరణాల విషయానికి వస్తే రూ.40.97 కోట్ల విలువైన ఆభరణాలు ఉన్నాయి. ఇక ఆమె వినియోగించే కారు విలువ రూ.9.82 లక్షలు. భార్య కన్నా భర్త అమితాబ్‌తోనే అత్యధిక విలువైన ఆభరణాలు ఉన్నాయి. రూ.54.77 కోట్ల ఆభరణాలు అమితాబ్‌ వద్ద ఉన్నాయని అఫిడవిట్‌లో జయ తెలిపారు. అమితాబ్‌ వద్ద కార్లు చాలా ఉన్నాయి. రూ.17.66 కోట్ల విలువ చేసే 16 కార్లు తన భర్త వద్ద ఉన్నాయని జయ వెల్లడించారు.

మొదట సినీ రంగంలో రాణించిన జయా బచ్చన్‌ తదనంతరం రాజకీయాల్లోకి వచ్చారు. ప్రస్తుతం ఐదో సారి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నిక కానున్నారు. సమాజ్‌వాదీ పార్టీ నుంచి జయా బచ్చన్‌ రాజ్యసభకు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. వివాహం తర్వాత కొన్నాళ్లకు ఆమె సినిమాల నుంచి విరామం తీసుకున్న ఆమె ఇటీవల 'రాకీ ఔర్‌ రాణికీ ప్రేమ్‌ కహానీ' సినిమాలో కీలక పాత్ర పోషించారు. బాలీవుడ్‌లో వీరిద్దరిదీ విజయవంతమైన ప్రేమ కథ.

విడాకుల వార్తలు?
కాగా ఇటీవల బిగ్‌ బీ, జయ విడిపోతున్నారని విస్తృత ప్రచారం జరిగింది. వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని బాలీవుడ్‌తోపాటు దేశంలో చర్చనీయాంశమైంది. ప్రస్తుతానికి ఆ వార్తలకు విరామం పడింది. ఆదర్శ దంపతులుగా జీవిస్తున్న వీరి జీవితంపై ఎన్నో ఏళ్లుగా పుకార్లు వస్తూనే ఉన్నాయి. కాగా వీరి కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌, ఐశ్వర్యా బచ్చన్‌ సినీ పరిశ్రమలో కొనసాగుతుండగా వారి పాప ఆరాధ్య బచ్చన్‌ త్వరలో సినీ పరిశ్రమలో అడుగుపెట్టే అవకాశం ఉంది. అమితాబ్‌ బచ్చన్‌ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌, దీపిక నటిస్తున్న 'ప్రాజెక్టు-కే'లో అమితాబ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News