How Hackers Hacking Mobiles Simply: మీకే తెలియకుండా మీ ఫోన్ హ్యాకింగ్‌కి ఇస్తున్నారు.. ఇదొక కొత్త మోసం
What is Public Charging Scam, Or Juice Jacking Scam: ఇటీవల కాలంలో సైబర్ కేటుగాళ్లు ఫోన్స్‌లోకి మాల్వేర్స్ లేదా స్పైవేర్స్ జొప్పించి ఆ ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు. దీనినే జూస్ జాకింగ్ స్కామ్ అని పిలుస్తారు. ఇటీవల కాలంలో ఈ జూస్ జాకింగ్ స్కామ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. దీంతో వచ్చే సమస్యలు ఏంటంటే...
What is Public Charging Scam, Or Juice Jacking Scam: మీరు ఏదైనా పని మీద బయటికెళ్లినప్పుడు, లేదా ప్రయాణాల్లో ఉన్నప్పుడు అనుకోకుండా మీ ఫోన్ బ్యాటరీ డౌన్ అయితే ఏం చేస్తున్నారు ? ఇంటికొచ్చే వరకు వేచిచూసేంత సమయం లేదని చెప్పి మీకు సమీపంలోని మొబైల్ స్టోర్‌లోనో లేక కిరాణం, స్టేషనరీ షాపుల్లోనో లేక హోటల్, రైలు, బస్సుల్లోని చార్జింగ్ పోర్టుల్లో చార్జింగ్ పెడుతున్నారా ? అయితే మీరు, మీ ఫోన్ రెండూ స్కామ్ బారిన పడినట్టే అనే విషయం మర్చిపోకండి. అదేంటి ? కేవలం ఫోన్ ఛార్జింగ్ పెట్టినంత మాత్రాన్నే స్కామ్ బారిన పడతామా అంటే అవుననే చెబుతున్నారు మొబైల్ ఎక్స్‌పర్ట్స్. ఆ ఫుల్ డీటేల్స్ ఏంటి అనేది మరింత లోతుగా వెళ్లి తెలుసుకుందాం రండి.
ఇటీవల కాలంలో పబ్లిక్ ప్లేసెస్‌లో చార్జింగ్ పెట్టిన ఫోన్స్‌లోకి కేటుగాళ్లు అదే యూఎస్‌బి కేబుల్ ద్వారా మాల్వేర్స్ లేదా స్పైవేర్స్ జొప్పించి ఆ ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు. దీనినే జూస్ జాకింగ్ స్కామ్ అని పిలుస్తారు. ఇటీవల కాలంలో ఈ జూస్ జాకింగ్ స్కామ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి.
ఇంతకీ ఈ జూస్ జాకింగ్ స్కామ్ అంటే ఏంటి ?
జూస్ జాకింగ్ స్కామ్ అంటే అది కూడా ఒక రకమైన సైబర్ ఎటాక్ అనే చెప్పొచ్చు. ఇది ఎలా జరుగుతుంది అంటే.. పబ్లిక్ ప్రదేశాల్లో ఉన్న చార్జింగ్ పోర్ట్స్‌లో మొబైల్ కానీ లేదా ఏ ఇతర డివైజెస్ అయినా చార్జింగ్ పెట్టినప్పుడు అదే యూనివర్సల్ సీరియల్ బస్ (USB) ద్వారా కేటుగాళ్లు మీ ఫోన్‌లోకి లేదా మీ చార్జింగ్ పెట్టిన ఏదైనా పరికరాల్లోకి మాల్వేర్స్ పంపించి మీ ఫోన్‌లోని డేటాని తస్కరించడం అన్నమాట. ఇదే జూస్ జాకింగ్‌ని పోర్ట్ జాకింగ్ అని కూడా అంటుంటారు.
యూఎస్ ఆర్మీ సైబర్ కమాండ్ చెబుతున్న వివరాల ప్రకారం ఈ జూస్ జాకింగ్ స్కామ్ అనేది కేవలం ఫోన్లకే పరిమితం కాదు. మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా ఫోన్ స్థానంలో మరే ఇతర పరికరాలు చార్జింగ్ పెట్టినా.. సైబర్ కేటుగాళ్లు అదే యూఎస్‌బి సహాయంతో దానికి కనెక్ట్ చేసి ఉన్న పరికరంలోకి మాల్వెర్స్ పంపించడం, హ్యాక్ చేయడం జరుగుతుంది.
మరి మీ ఫోన్ హ్యాకింగ్ బారిన పడినట్టు ఎలా తెలిసేది ?
ఇలాంటి కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నప్పుడు కానీ లేదా తమ మొబైల్ ఫోన్ తరచుగా అదేపనిగా హ్యాంగ్ అవుతున్నప్పుడు కానీ చాలామందిలో ఒక సందేహం వస్తుంది. ఇంతకీ మన ఫోన్ కూడా హ్యాక్ అయి ఉంటుందా ? ఒకవేళ హ్యాక్ అయితే ఆ విషయం తెలుసుకోవడం ఎలా అనే సందేహం చాలామందిని వెంటాడుతుంటుంది.
ఫోన్ పని తీరులో మార్పులు :
ఫోన్ పని తీరులో మార్పులు కనిపించడం, వేగం తగ్గి నెమ్మదించడం, మన ప్రమేయం లేకుండానే తనంతట తనే ఫోన్ స్విచాన్ అవడం, స్విఛాఫ్ అవడం వంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయంటే ఆ ఫోన్ హ్యాకింగ్ బారిన పడి ఉండే అవకాశాలు ఉన్నాయి.
మిస్టరీ యాప్స్ :
మీ ప్రమేయం లేకుండానే మీరు డౌన్‌లోడ్ చేయని యాప్స్ ఇన్‌స్టాల్ అవుతుండటం, లేదా మీరు ఉపయోగించే యాప్స్‌లో కొన్ని మీ ప్రమేయం లేకుండానే అన్‌ఇన్‌స్టాల్ అవుతుండటం, మీ ఫోన్ నుంచి మీ ప్రమేయం లేకుండానే మెసేజెస్ కానీ లేదా మెయిల్స్ కానీ సెండ్ అవడం లాంటివి మీ ఫోన్ హ్యాకింగ్ బారిన పడింది అనడానికి స్పష్టమైన సంకేతాలుగా భావించవచ్చు. అంతేకాకుండా మీ ఫోన్‌లో డేటా వినియోగం పెరిగిన సందర్భాల్లోనూ మీరు మీ ఫోన్‌పై ఓ కన్నేసి పెట్టాల్సి ఉంటుంది.
పాప్‌అప్స్ :
ఒక ఫోన్‌పై పాప్‌అప్స్, ఇతర నోటిఫికేషన్స్ ఎప్పుడూ వచ్చేవాటికంటే భారీగా వస్తున్నాయి అంటే ఆ ఫోన్ హ్యాంకింగ్ బారిన పడిందనే అనుకోవచ్చు. అలాగే మీ హోమ్ స్క్రీన్‌లో ఏవైనా భారీగా మార్పులు కనిపిస్తున్నాయి అంటే అలాంటప్పుడు కూడా మీ ఫోన్ హ్యాకింగ్ బారిన పడటమే అందుకు ఒక కారణంగా భావించవచ్చు.
ఇది కూడా చదవండి : Giant Black King Cobra Video: పంట పొలాల్లోకి భయంకరమైన గిరి నాగు పాము.. పరుగులు తీసిన రైతులు
ఉన్నట్టుండి బ్యాటరీ డౌన్ అవడం, ఫోన్ విపరీతంగా హీటెక్కడం :
ఫోన్ ఎంత ఫుల్ చార్జింగ్ పెట్టినా ఉన్నట్టుండి బ్యాటరీ అయిపోవడం లేదా ఫోన్ విపరీతంగా హీటెక్కడం వంటివి జరుగుతున్నాయి అంటే అందుకు ఒకటి బ్యాటరీలో ఏదైనా సాంకేతిక లోపమైనా అయ్యుండాలి లేదంటే ఆ ఫోన్ హ్యాకింగ్ బారినపడే పడి ఉండాలి అని సైబర్ ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. అందుకే ఇలాంటి సమస్యలు తలెత్తినప్పుడు ఎక్కువ రిస్క్ తీసుకోకుండా మొబైల్ ఎక్స్‌పర్ట్ దగ్గరికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించుకోండి.
ఇది కూడా చదవండి : Girl Catched Two Giant Snakes: 2 భయంకరమైన భారీ పాములను వెంటపడి మరీ ఒట్టి చేత్తో పట్టుకున్న యువతి.. నెటిజెన్స్ గరం గరం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి