What Is Sonic Boom: ప్యారిస్ ను వణికించిన సోనిక్ బూమ్ అంటే ఏంటి ? ఎందుకలా జరిగింది ?
ప్యారిస్ లో ( Paris ) ఇటీవలే భారీ పేలుడు శబ్దం వినిపించడంతో ప్రజలు వణికిపోయారు. అక్కడే జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ క్రీడాకారులు కూడా షాక్ అయ్యారు. అక్కడి గోడలు కదిలిపోయాయి. నలుదిక్కులు అదే శబ్దం మారుమోగింది. ప్రజలు గందరగోళానికి గురి అయ్యారు. అ
ప్యారిస్ లో ( Paris ) ఇటీవలే భారీ పేలుడు శబ్దం వినిపించడంతో ప్రజలు వణికిపోయారు. అక్కడే జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ క్రీడాకారులు కూడా షాక్ అయ్యారు. అక్కడి గోడలు కదిలిపోయాయి. నలుదిక్కులు అదే శబ్దం మారుమోగింది. ప్రజలు గందరగోళానికి గురి అయ్యారు. అయితే చివరికి అది బ్లాస్ట్ కాదు అని తేలింది. ఆ సమయంలో పారిస్ గగనతలం నుంచి వెళ్తున్న ఒక ఫైటర్ జెట్ వల్ల ఆ శబ్దం వచ్చింది అని.. దాన్నే సోనిక్ బూమ్ అంటారు.
ALSO READ | Sonic Boom In Paris: ఫైటర్ జెట్ సౌండ్ విని వణికిపోయిన ప్యారిస్ ప్రజలు!
సోనిక్ బూమ్ అంటే ఏంటి ?
ఫైటర్ జెట్ విమానం సాధారణ విమానాల కన్నా వేగంగా వెళ్తుంది. మెరుపు వేగం అంటాం కదా.. అంత స్పీడు ఉంటుంది. అయితే ఇలా వెళ్తున్న సమయంలో జెట్ ( Jet ) విమనాలు సూపర్ సోనిక్ మోడ్ లోకి లేదా ప్రోఫైల్ లోకి స్విచ్ లేదా మారుతూ ఉంటాయి. ఇలా మారినప్పుడు ఈ ఎఫెక్ట్ కు వచ్చే శబ్ధమే సోసిక్ మూమ్ ( Sonic Boom). [[{"fid":"194175","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Fighter-Jet-Blew","field_file_image_title_text[und][0][value]":"Fighter-Jet-Blew"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Fighter-Jet-Blew","field_file_image_title_text[und][0][value]":"Fighter-Jet-Blew"}},"link_text":false,"attributes":{"alt":"Fighter-Jet-Blew","title":"Fighter-Jet-Blew","class":"media-element file-default","data-delta":"1"}}]]
ధ్వని వేగాన్ని ( Speed Of Sound Mach 1.0 ) దాటి అంతకు మించిన వేగంగా వెళ్తున్న సమయంలో సౌండ్ బ్యారియర్ బ్రేక్ అవుతుంది. అంటే శబ్ద వేగాన్ని బద్దలు కొట్టి తన కొత్త వేగంతో ప్రయాణిస్తున్న సమయంలో క్షణం పాటు ధ్వని తరంగాల చలనంలో, వాటి వేగంలో మార్పు వస్తుంది దాని వల్ల ఇలా కలుగుతుంది. దాని వల్ల భారీ సౌండ్ వస్తుంది. దీనిని ఉష్ణోగ్రత, ఆల్టిట్యూడ్ వంటి అంశాలు కూడా ప్రభావితం చేస్తాయి.
అందుకే అంత శబ్దం
నిజానికి ఫైటర్ జెట్స్ అనేవి భారీ శబ్దాలు చేయడం సాధారణమే. అయితే కరోనా వైరస్ ( Coronavirus ) వల్ల చాలా పనులు నిలిచిపోవడం, లేదా ప్రజలు రోడ్లపైకి తక్కువ రావడంతో ఇతర శబ్దాలు తక్కువగా నమోదు అవుతున్నాయి. దీంతో ఈసారి ఆ శబ్దం మరింత ఎక్కువగా, భీతిగొలిపే విధంగా అనిపించింది.
ఉదాహరణకు ఒక ట్రక్ రోడ్డుపై వేగంగా వెళ్తున్న సమయంలో ట్రక్ ముందరి భాగంలో ఉండే తరంగాలు దగ్గరగా ఉంటాయి. వెనక్కి వెళ్లిన తరంగాల మధ్య దూరం ఉంటుంది. వెనక ఉన్న తరంగాలు వ్యాపిస్తాయి. ముందు భాగంలో ఉన్న తరంగాలకు ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. వెనక ఉన్న తరంగాలకు తక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. [[{"fid":"194176","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
వేగం పెరిగినప్పుడు
ట్రక్ అయినా జెట్ అయినా వాటిలో చలనం ముఖ్యం. వేగాన్ని బట్టి ధ్వని తరంగాల ప్రభావితం అవుతాయి. ఎయిర్ క్రాఫ్ట్ సూపర్ సోనిక్ వేగంతో ప్రయాణిస్తున్న తరుణంలో అంటే.. సముద్రం స్థాయిలో లేదా సీ లెవల్ లో గంటకు 1225 కన్నా ఎక్కువ వేగంతో ప్రయాణిస్తున్న తరుణంలో ధ్వని తరంగాలు మరింత వేగంగా ముందు నుంచి ఎయిర్ క్రాఫ్ట్ వెనక భాగంలోకి కదులుతాయి.
ఈ వేగంలో కొత్తగా క్రియేట్ అయిన తరంగాలు, పాత తరంగాలు రెండూ ఎయిర్ క్రాఫ్ట్ వెనక భాగంలో ఎదురెదురవుతాయి. దాన్ని మ్యాచ్ కోన్ (Mach Cone) అంటారు. దాంతో అక్కడ హైపర్ బోలా-ఆకారం ఏర్పడుతుంది. అది క్షణాల్లో బూమ్ కార్పెట్ అనే ఎఫెక్ట్ గా విడుదల అవుతుంది. అది భూమిపైకి చేరే వరకు సోనిక్ బూమ్ గా మారుతుంది.
ALSO READ| Bio-bubble: బయోబబుల్ అంటే ఏంటి? ఆటగాళ్లు పూర్తిగా సురక్షితమా
[[{"fid":"194177","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]
File Photo (Twitter/@Armee_de_lair)
Ammonium Nitrate: అమ్మోనియం నైట్రేట్ అంత ప్రమాదకరమా ?
మన దేశంలో సుకోయ్ SU-30 MKI ( Mach 2.35 ), మిరాజ్-200 ( Mach 2.3 ) అత్యంత వేగవంతమైన ఫైటర్ జెట్స్.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR