WhatsApp Updates: వాట్సాప్ కొత్త ఫీచర్ అదిరిపోయిందిగా..
WhatsApp Always Mute | ఫేస్ బుక్ ( Facebook) నిర్వహణలో వాట్సాప్ నిత్యం కొత్త అప్డేట్స్ తో యూజర్లకు మరింత సౌకర్యవంతమైన మెసేజింగ్ అనుభవాన్ని అందించేందుకు ప్రయత్నిస్తోంది.
WhatsApp Groups | ఫేస్ బుక్ ( Facebook ) నిర్వహణలో వాట్సాప్ నిత్యం కొత్త అప్డేట్స్ తో యూజర్లకు మరింత సౌకర్యవంతమైన మెసేజింగ్ అనుభవాన్ని అందించేందుకు ప్రయత్నిస్తోంది. యూజర్లు కోరుకుంటున్న మార్పులు, ఫీచర్లను అప్డేట్ చేస్తోంది. తాజాగా గ్రూప్ చాట్స్ నోటిఫికేషనన్స్ వల్ల విసిగిపోయిన యూజర్ల కోసం బంగారం లాంటి అప్డేట్ తీసుకొచ్చింది.
Read Also | Rashmi Gautam: యాంకర్ రష్మీ కి కరోనా..
శాశ్వతంగా గ్రూప్ నోటిఫికేషన్లను మ్యూట్ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది వాట్సాప్. ఇప్పటి వరకు పరిమిత సమయం వరకు మాత్రమే గ్రూప్ నోటిఫికేషన్లను మ్యూట్ పెట్టే అవకాశం ఉండేది. తరువాత మళ్లీ గ్రూప్ నోటిఫికేషన్లు మొదలయ్యేవి. దాంతో పరిష్కారంగా ఈ కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది వాట్సాప్ ( WhatsApp ) . ఈ మేరకు తమ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేసి సమాచారం అందించింది. ఇకపై గ్రూప్ చాట్స్ ను ఎప్పటికీ మ్యూట్ చేసేయవచ్చు.
Read Also| NEET Results 2020: ఆరు మార్కులు వచ్చాయని... విద్యార్థిని ఆత్మహత్య
ఈ కొత్త ఫీచర్ యాండ్రాయిడ్, ఐఓఎస్ ( IOS) వినియోగదారులకు వెంటనే అందుబాటులోకి వస్తుంది అని తెలిపింది వాట్సాప్. దీని వల్ల ఇకపై గ్రూప్స్ చాట్ నోటిఫికేష్స్ బెడదను సైలెన్స్ చేసేవచ్చు. ఆ గ్రూప్ నుంచి మీకు మెసేజెస్, వీడియోలు, ఏ ఫీడ్ మీకు రావు. అవసరం అనిపిస్తే వెంటనే మీరు అన్ మ్యూట్ కూడా చేసేయవచ్చు.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR