Whatsapp Pay Cashback offer: ఇప్పుడంతా డిజిటల్ పేమెంట్స్ హవా నడుస్తోంది. వ్యాలెట్‌లో మనీ క్యారీ చేసేవాళ్ల సంఖ్య చాలావరకు తగ్గిపోయింది. ఏ వస్తువు కొనుగోలు చేసినా గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి పేమెంట్స్ యాప్ ద్వారానే చెల్లింపులు జరుపుతున్నారు. డిజిటల్ పేమెంట్స్ యాప్‌కి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కూడా పేమెంట్ ఆప్షన్‌ని అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే వాట్సాప్ పేకి కస్టమర్ల నుంచి పెద్దగా స్పందన రావట్లేదు. ఈ నేపథ్యంలో కస్టమర్లను ఆకర్షించేందుకు వాట్సాప్ క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. వాట్సాప్ పే ద్వారా జరిపే మూడు ట్రాన్సాక్షన్స్‌పై రూ.105 మేర క్యాష్ బ్యాక్ ఆఫర్‌ ప్రస్తుతం అందుబాటులో ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందేందుకు కనీస మొత్తంలో రూ.1 ట్రాన్సాక్షన్ జరిపిన చాలు. రూ.35 చొప్పున మూడు ట్రాన్సాక్షన్స్‌పై రూ.105 వరకు క్యాష్ బ్యాక్ పొందుతారు. అయితే ఇది లిమిటెడ్ ఆఫర్ మాత్రమే. అందునా.. ఎంపిక చేసిన కొందరు కస్టమర్స్‌కు మాత్రమే ఇది అందుబాటులో ఉంది. బిజినెస్ అకౌంట్స్ ఉపయోగించేవారికి ఈ ఆఫర్ వర్తించదు. వాట్సాప్ పే ద్వారా క్యాష్ బ్యాక్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం... 


ఇలా చేస్తే క్యాష్ బ్యాక్ పొందవచ్చు :


మొదట వాట్సాప్ ఓపెన్ చేసి.. ఎవరికైతే డబ్బులు పంపించాలనుకుంటున్నారో వారి చాట్ బాక్స్ ఓపెన్ చేయండి.


కింది భాగంలో కుడి వైపు ఉన్న పేమెంట్స్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.


'గెట్ స్టార్టెడ్' ఆప్షన్‌పై క్లిక్ చేయండి. 'యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ'ని సెలెక్ట్ చేయండి.


వెరిఫై ఆప్షన్ ద్వారా మీ ఫోన్ నంబర్‌ను వెరిఫై చేసుకోండి. మీ బ్యాంకు ఖాతాతో లింకప్ అయి ఉన్న ఫోన్ నెంబరే వాట్సాప్ నెంబర్‌గా ఉండాలి.


వెరిఫికేషన్ తర్వాత 'యాడ్' ఆప్షన్‌పై క్లిక్ చేయండి. మీ బ్యాంక్ ఖాతా ఆటోమేటిగ్గా వాట్సాప్ పేతో లింకప్ అవుతుంది.


ఆ తర్వాత 'నెక్స్ట్' ఆప్షన్‌పై క్లిక్ చేసి పేమెంట్ ఆప్షన్ ఎంపిక చేసుకోండి. ఎంత డబ్బు ట్రాన్సాక్షన్ చేయాలనుకుంటున్నారో.. ఆ వివరాలు నమోదు చేయండి. యూపీఐ పిన్‌ని వెరిఫై చేసుకోండి.


పిన్ నెంబర్ ఎంటర్ చేయగానే పేమెంట్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. వెంటనే వాట్సాప్ చాట్‌కి రీడైరెక్ట్ అవుతుంది. అంతే.. ట్రాన్సాక్షన్ ముగియగానే రూ.35 క్యాష్ బ్యాక్ రూపంలో పొందుతారు. అలా మూడు ట్రాన్సాక్షన్స్ జరిపితే రూ.105 వరకు క్యాష్ బ్యాక్ పొందుతారు.


Also Read: Rishabh Pant: అందుకే ఓడిపోయాం.. ఇక మూడు మ్యాచ్‌లు గెలవాల్సిందే: పంత్



 


Also Read: Vastu Tips for Kitchen: వంటగది నిర్మాణానికి పది వాస్తు చిట్కాలు?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.