Telegram: వాట్సాప్‌ని తలదన్నేలా టెలిగ్రామ్ కొత్త ఫీచర్స్
Whatsappకి ఇప్పటికే గట్టి పోటీ ఇస్తున్న Telegram app మరింత మంది యూజర్స్‌ని ఆకట్టుకునేలా సరికొత్త ఫీచర్స్‌తో ఆండ్రాయిడ్ యూజర్స్ ముందుకొచ్చింది.
Whatsappకి ఇప్పటికే గట్టి పోటీ ఇస్తున్న Telegram app మరింత మంది యూజర్స్‌ని ఆకట్టుకునేలా సరికొత్త ఫీచర్స్‌తో ఆండ్రాయిడ్ యూజర్స్ ముందుకొచ్చింది. ప్రొఫైల్ వీడియోస్ ( Profile videos ) ఆప్షన్‌ని చేర్చడంతో పాటు ఇప్పుడు ఒకేసారి 2GB వరకు భారీ ఫైల్స్ షేర్ చేసుకునేలా టెలిగ్రామ్ యాప్‌ని అప్‌డేట్ చేశారు. అదే సమయంలో టెలిగ్రామ్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలను ఎడిట్ చేసి క్వాలిటీ పెంచుకోవడం, యానిమేటెడ్ స్టిక్కర్స్ జోడించడం వంటి ఫీచర్స్ కూడా ఇప్పుడు టెలిగ్రామ్ యాప్‌లో అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా మీ మూడ్‌కి అనుగుణంగా వెంటనే సింగిల్ స్టెప్‌లో సెట్ యాజ్ మెయిన్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా మళ్లీ పాత ప్రొఫైల్ ఫోటోను లేదా వీడియో సెలెక్ట్ చేసుకునేవిధంగా టెలిగ్రామ్ యాప్ డెవలప్ చేశారు. Also read: Gmail new design: జీమెయిల్ ఇక ముందులా ఉండదు
People Nearby పీపుల్ నీయర్‌బై:
పీపుల్ నీయర్‌బై అనే ఆప్షన్ ద్వారా మిమ్మల్ని టెలిగ్రామ్ యూజర్ ఎవరైనా సంప్రదించినప్పుడు.. వాళ్లు నిజానికి ఎంత దూరంలో ఉన్నారనే విషయాన్ని సైతం టెలిగ్రామ్ యాప్ తెలియజేస్తుంది.
Mini-thumbnails మిని థంబ్ నెయిల్స్ :
చాట్ లిస్ట్ ఓపెన్ చేయకుండానే మీకు ఎవరెవరు ఏమేం మెసేజెస్ పంపించారో మీరు చెక్ చేయవచ్చు. అందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే.. చాట్‌లో ఎవరి మెస్సెజెస్‌ని ఐతే మీరు చదవాలని అనుకుంటున్నారో వారి ప్రొఫైల్ పిక్చర్‌ని హోల్డ్ చేసి పట్టుకోవాలి. Also read: Andhra Pradesh: లక్ష దాటిన కరోనా కేసులు
Privacy settings ప్రైవసీ సెట్టింగ్స్:
మీ ఫోన్‌లో సేవ్ చేయని కాంటాక్ట్స్ నుంచి వచ్చే మెసెజెస్‌ని అన్నింటినీ ఒక ఆర్కైవ్స్‌లోకి వెళ్లేలా ప్రైవసీ, సెక్యురిటీ సెట్టింగ్స్ మార్చుకోవచ్చు.
Group Stats గ్రూప్ స్టాట్స్ :
500 మంది కంటే అధికంగా సభ్యులు ఉన్న గ్రూప్స్ లో ఎవరు ఎక్కువగా యాక్టివ్ గా ఉన్నారు ? గ్రూప్ పురోగతి ఎలా ఉందనే గణాంకాలను చెబుతూ ఆకట్టుకునే గ్రాఫ్స్ రూపంలో గ్రూప్ స్టాట్స్ అందుబాటులో ఉండటం సరికొత్త ఫీచర్స్ లో ఉన్న మరో ప్రత్యేకత. Also read : Chicken prices: కిలో చికెన్ ధర రూ.500